ఇకపై గన్నవరం నుంచి విదేశాలకు మామిడి ఎగుమతులు

ఇకపై గన్నవరం నుంచి విదేశాలకు మామిడి ఎగుమతులు

గన్నవరం నుంచి కార్గో సర్వీస్‌ మంగళవారం ఉదయం ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో మంత్రి కొల్లు రవీంద్ర పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గన్నవరం నుంచి కార్గో సేవలకు గతంలో ఘనమైన చరిత్ర ఉందన్నారు. 1980లోనే గన్నవరం నుంచి మాంసం ఎగుమతులు జరిగాయని తెలిపారు. ఏసియాలోనే అతిపెద్ద మామిడి మార్కెట్‌ అయిన నున్న నుంచి ప్రతి ఏటా రూ.150 కోట్ల నుంచి రూ.250కోట్ల వ్యాపారం జరుగుతోందని చెప్పారు. ఇకపై గన్నవరం నుంచి విదేశాలకు మామిడి ఎగుమతులు ఉంటాయన్నారు. విదేశాలకు, దేశంలోని వివిధ నగరాలకు ఆర్గానిక్‌ ఉత్పత్తుల ఎగుమతులకు గన్నవరం గమ్యస్థానం కాబోతోందని మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు.

Author: admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *