నా చావుకు అత్తింటివారే కారణం: యువకుడి సెల్ఫీ వీడియో

భార్య చేసిన మోసంతో మనోవేదనకు గురై ఆత్మహత్య చేసుకున్న భర్త

తన చావుకు భార్య, ఆమె కుటుంబసభ్యులే కారణమని సెల్ఫీ వీడియో

ఐదేళ్ల కిందట ప్రేమించి పెళ్లి చేసుకున్న వైనం

భార్యను బీటెక్‌ వరకు చదివించి ఉద్యోగం ఇప్పించిన భర్త

ప్రాణానికి ప్రాణంగా ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య తనను మోసం చేసిందని గురవారెడ్డి తీవ్ర మానసిక క్షోభకు గురయ్యాడు. తెలిసో తెలియకో తప్పుచేసినా సరిదిద్దుకోమని చెప్పాడు. అయినా మాట వినలేదు. విషయాన్ని అత్తమామలకు చెప్పి మందలించి సరిదిద్దమన్నాడు. వారు కూడా కూతురు పక్షానే మాట్లాడి అల్లుడిని పోలీస్‌స్టేషన్‌లో పెట్టి కొట్టించారు. కూతురు చేసిన తప్పు సరిదిద్దుతారని వారికి చెబితే తనపైనే కేసు పెట్టి పోలీసులతో కొట్టించారనే తీవ్ర మనోవేదనకు గురై ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

విజయవాడ కృష్ణలంక గుంటూరువారివీధిలో నివాసముంటున్న గురువారెడ్డి (28) ఇంటర్‌ చదివి జెంజిసర్కిల్‌ వద్ద ఒక లాడ్జిలో గుమస్తాగా పనిచేస్తుంటాడు. ఎదురింట్లో నివాసముండే గాయత్రి ఇంటర్‌ చదువుతుండగా ఒకరంటే, ఒకరు ఇష్టపడ్డారు. ఆ ఇష్టం కాస్తా ప్రేమగా మారటంతో ఇరు కుటుంబ సభ్యులను ఒప్పించి ఐదేళ్ల కిందట పెళ్లి చేసుకున్నారు. భార్య చదువుకుంటాను అంటే భర్త బీటెక్‌ వరకు చదివించి ఆమె కోరిక మేరకు హైదరాబాద్‌లో ఒక సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో ఉద్యోగం ఇప్పించాడు. భర్త నగరంలోనే ఉండగా ఆమె హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తూ ప్రతి నెలా విజయవాడ వచ్చి వెళ్తుండేది. ఇటీవల ఆమె ప్రవర్తనలో తీవ్ర మార్పులు చోటుచేసుకోడం భర్త గమనించాడు. రోజూ ఫోన్‌చేసే భార్య అకస్మాత్తుగా మానేసింది. తాను చేస్తే స్పందించడంలేదు. ప్రతి నెలా వచ్చే భార్య రావటం పూర్తిగా ఆపేసింది.బతిమిలాడినా….
దీంతో హైదరాబాద్‌ వెళ్లి భార్యను నిలదీస్తే భర్త గుండెలు పగిలే నిజాలు చెప్పింది. ‘నీవంటే నాకుఇష్టం లేదు… తెలిసీ తెలియని వయస్సులో నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాను… నీతో ఉండటం నాకు ఇష్టం లేదు.. ఇక్కడ నా హోదాకు తగిన వ్యక్తిని ప్రేమిస్తున్నాను.. ఆయన్నే పెళ్లి చేసుకుంటాను.. నా గురించి ఆలోచించవద్దంటూ’ కరాఖండిగా తెలపడంతో ఒక్కసారిగా అవాక్కయ్యాడు. తెలిసో తెలియకో తప్పు చేశావు ప్రవర్తన మానుకొని వచ్చేయి… కలసి సంతోషంగా జీవిద్దామని భార్యను బతిమిలాడినా మాట వినలేదు.

భార్యను మర్చిపోవాలని బెదిరింపులు….
దీంతో విషయం పెద్దల సమక్షంలో మాట్లాడుకుందామంటూ గత శనివారం గాయత్రిని తీసుకొని ఆమె తల్లిదండ్రుల వద్దకు వెళ్లాడు. మొదటి నుంచి వీరి ప్రేమ వివాహం ఇష్టంలేని వారు కూతురు తరపునే మాట్లాడారు. తమ కూతురిని మర్చిపోవాలని, లేకపోతే వేధించినట్లు కేసు పెడతామంటు భయపెట్టారు. అదే రోజు రాత్రి నాట కీయ పరిణామాల మధ్య గాయత్రి, ఆమె అమ్మ, నాన్న, అన్నయ్యలు నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేసుకోవడంతో వారి బంధువులు ఆంధ్రా ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.

పోలీసులతో కొట్టించి…
మరుసటి రోజు ఆదివారం గాయత్రి భర్త తనపై, తన కుటుంబంపై వేధింపులకు పాల్పడుతున్నారంటు కృష్ణలంక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు గురువారెడ్డిని పోలీస్‌స్టేషన్‌కు పిలిపించి తీవ్రంగా కొట్టినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. విచారణ నిమిత్తం సోమవారం తిరిగి రావాలంటూ అదేశించడంతో భార్య చేసిన మోసంతో తీవ్ర మానసికక్షోభ అనుభవిస్తున్న గురువారెడ్డి పోలీస్‌స్టేషన్‌కు వెళితే వారు పెట్టే చిత్రహింసలకు భయపడి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుని సోమవారం ఉదయం 11 గంటల తన చావుకు గల కారణాలను తెలియజేస్తు సెల్ఫీ వీడియోతీసి తన సోదరుడు, మిత్రులకు వాట్సప్‌చేసి రైలు పట్టాలపై పడుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

వేధింపులతోనే ఆత్మహత్య….
విచారణ పేరుతో సోమవారం ఉదయం ఇద్దరు కానిస్టేబుల్స్‌ ఇంటికి వచ్చి తన బిడ్డను తీసుకువెళ్లారని, అదే వాడి చివరి చూపు అని తమకు తెలియదని, రాత్రి 8 గంటలకు మీ బిడ్డ చనిపోయాడంటూ పోలీసులు తెలిపారన్నారు. గాయత్రి కుటంబసభ్యులు, పోలీసుల వేధింపులతోనే ఆత్మహత్యకు పాల్పడ్డాడని తల్లి, నానయ్మ సీతమ్మలు బోరున విలపించారు. గురవారెడ్డి చావుకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని కోరారు.

ఆత్మహత్య చేసుకోవడానికి ముందు ఓ యువకుడు తీసిన సెల్ఫీ వీడియో కలకలం రేపుతోంది. విజయవాడ కృష్ణలంకకు చెందిన గురువారెడ్డి మంగళవారం రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. తన ఆత్మహత్యకు దారితీసిన కారణాలను వివరిస్తూ ఓ సెల్ఫీ వీడియోను తీసి అనంతరం రైలుకింద పడి ప్రాణాలు తీసుకున్నాడు.

Wife Cheating Husband Selfie Suicide In Krishna - Sakshi

సెల్ఫీ వీడియోలో ఏముందంటే..
‘సారీ డాడీ. ఇంతగా బాధపెడతాననుకోలేదు. గాయాత్రి నేను నిన్ను ఎంతగా ప్రేమించానో నీకు తెలుసు. కానీ నువ్వు నన్ను ఎంతగా బాధపెట్టావో నీకు తెలుసు. ఏమీ చేయని తప్పుకు లోపల(పోలీసు స్టేషన్‌) కూర్చోపెట్టావు. ఎంత బాధగా ఉంటుందో తెలుసా అది. నువ్వు ఏముంది హ్యాపీగా ఉన్నావు. నా చావుకు కారణం నువ్వు, మీ అ‍మ్మ నాన్న, మీ అన్నయ్య. వాళ్లు ఎంతగా మోసం చేశారో నీకు తెలుసు. రాత్రికి రాత్రి మాటమార్చెస్తారా. ఎంత పని చేశావు కన్నా. నీకోసం ఎంత చేశానో నీకు తెలుసు. సరే బాయ్‌… ఒక వేళ బతికుంటే మళ్లీ కలుద్దాం.. కిట్టు అమ్మానాన్నలను జాగ్రత్తగా చూసుకో..’ అంటూ సెల్ఫీ వీడియోలో మాట్లాడి అనంతరం రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు.

కృష్ణలంక పోలీసులు గురువారెడ్డిని చెయ్యని తప్పుకు రెండు రోజులు స్టేషన్ లో ఉంచి ఇబ్బంది పెట్టారని బంధువులు ఆరోపించారు. దీంతో తీవ్ర మనస్తాపం చెంది అతడు బలవన్మరణానికి పాల్పడ్డాడని వాపోయారు. గురువారెడ్డి ఆత్మహత్యకు కారణమైన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

Author: admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *