ఓ దర్శకుడైతే నన్ను రాత్రి 3 గంటలకు రమ్మన్నాడు

మల్లికా షెరావత్.. ఈ పేరు చెప్పగానే మర్డర్ సినిమా గుర్తొస్తుంది. అందులో ఆమె హాట్ హాట్ సన్నివేశాలు చాలామందికి ఇప్పటికీ గుర్తే. అలాంటి హాట్ హీరోయిన్ కాస్తా బాలీవుడ్ కు దూరమైపోయింది. కేవలం కాస్టింగ్ కౌచ్ వల్లనే తను ఇండస్ట్రీకి దూరమైపోయానని చెప్పుకొచ్చింది మల్లికా షెరావత్. తెరపై చూపించిన శృంగారాన్ని తెరవెనక కూడా అందించాలనే

 

డిమాండ్లు ఎక్కువవ్వడంతో పరిశ్రమను వీడాల్సి వచ్చిందని చెప్పుకొచ్చింది.”చాలామంది హీరోలు నన్ను అడిగారు. తెరపై అంత శృంగారం ఒలకబోసే నువ్వు, తెరవెనక మాతో అంతే సెక్సీగా ఎందుకు ఉండవు అని ప్రశ్నించారు. ప్రైవేట్ లైఫ్ లో కూడా మాతో అంతే క్లోజ్ గా ఉండు అని బలవంతం చేసేవారు. అలా చాలా సినిమాలు మిస్ అయిపోయాయి.”

Image result for mallika sherawat

దాదాపు ప్రతి హీరో తనను అర్థరాత్రిళ్లు ఇంటికి పిలిచేవాడని, దీంతో బాగా అభద్రతా భావానికి లోనయ్యాని చెప్పుకొచ్చింది మల్లిక. కొన్ని నెలల పాటు సినిమాలు చేసిన తర్వాత బాలీవుడ్ లో సినిమాలు తగ్గించేశానని తెలిపింది.”నేనేంటి? ఎక్కడ్నుంచి వచ్చాను? ఎంత కష్టపడి ఈ స్థాయికి వచ్చాను? ఇవన్నీ ఎవరూ పట్టించుకోవట్లేదు. నేను ఎన్ని లిప్ కిస్సులు పెట్టాననేది ఇంపార్టెంట్ గా మారిపోయింది. నా నుంచి చాలా మంది హీరోలు, ఇంకా ఎక్కువ ఆశించారు. దీంతో నేను ఇన్-సెక్యూర్ ఫీలయ్యాను.”

 

పడక సుఖం అందించమని బలవంతం చేసిన వ్యక్తుల్లో దర్శకులు కూడా ఉన్నారంటోంది మల్లిక. ఓ దర్శకుడు అయితే అర్థరాత్రి 3 గంటలకు రమ్మన్నాడని, ఆ తర్వాత మానసికంగా బాగా హింసించాడని కూడా బయటపెట్టింది.

Related image

“హీరోలే కాదు, చాలామంది దర్శకులు కూడా ఉన్నారు. ఓ దర్శకుడైతే నన్ను రాత్రి 3 గంటలకు రమ్మన్నాడు. ఆ టైమ్ లో ఎందుకు పిలిచాడో నాకు తెలుసు. అప్పట్లో ఈ విషయంపై మాట్లాడ్డానికి నాకు ధైర్యం చాల్లేదు. నన్ను మెంటల్లీ చాలా హింసించిన ఆ వ్యక్తి ఇంకా మన ఇండస్ట్రీలోనే ఉన్నాడు. అప్పటి ఘటనలపై మాట్లాడాలంటే నాకు ఇప్పటికీ భయమేస్తోంది.”ఇలా కాస్టింగ్ కౌచ్ పై ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడిన మల్లిక, సదరు హీరోలు, దర్శకుల పేర్లను మాత్రం వెల్లడించడానికి నిరాకరించింది. 2015లో వచ్చిన డర్టీ పాలిటిక్స్ సినిమా తర్వాత మళ్లీ కనిపించలేదు మల్లిక. రీసెంట్ గా ఓ వెబ్ సిరీస్ లో నటించిన ఈ బ్యూటీ, త్వరలోనే ఇంకో బాలీవుడ్ సినిమాలో మెరవనుంది.

Author: admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *