బిజినెస్‌లోకి సూపర్‌‌స్టార్ మహేష్‌బాబు

According to Film Nagar buzz, Mahesh Babu has begun constructing a huge multiplex in Gacchibowli area in Hyderabad.

He has reportedly joined hands with Asian films to venture into this business. The multiplex will have state of the art facilities and it is already under construction, say sources.
టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేష్‌ బాబు ఓ కొత్త వ్యాపారానికి శ్రీకారం చుట్టారు. ఇప్పటికే మహేష్ ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి, విశాఖపట్నం ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ రంగంలో భారీగా పెట్టుబడులు పెట్టిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఆయన మల్టీప్లెక్స్ రంగంలోకి అడుగుపెడుతున్నారు. ఏషియన్ ఫిలిమ్స్‌తో కలిసి హైదరాబాద్‌లోని పలు చోట్ల మల్టీప్లెక్స్ థియేటర్‌లు నిర్మిస్తున్నారు.


తాజాగా మహేష్ మల్టీప్లెక్స్‌ థియేటర్లకు సంబంధించిన లోగో సోషల్‌మీడియాలో విడుదలైంది. ‘‘ఏఎంబీ సినిమా’’ పేరుతో ఈ లోగోని విడుదల చేశారు. ఏఎంబీ అంటే.. ‘ఏషియన్ మహేష్‌ బాబు సినిమాస్’. ప్రస్తుతం మహేష్ బాబు, వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహర్షి అనే చిత్రంలో నటిస్తున్నారు.

Author: admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *