మహేష్ బాబు “రాజసం”..!

కొరటాలశివ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా వచ్చిన చిత్రం “భరత్ అనే నేను”. ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో మహేష్ తిరిగి ఫామ్ లోకి వచ్చాడు. ఈ సినిమా హిట్ తో మహేష్ ఫాన్స్ పండుగ చేసుకుంటున్నారు. ప్రస్తుతం మహేష్ బాబు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కబోయే తన 25 వ సినిమా కోసం సిద‍్ధమవుతున్నారు.

Image result for maheshbabu rajasam\

త్వరలో రెగ్యులర్‌ షూటింగ్‌కు వెళ్లనున్న ఈ సినిమాలో మహేష్‌ డిఫరెంట్‌ లుక్‌లో కనిపించనున్నాడు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన వార్త ఒకటి సోషల్‌ మీడియాలో ట్రెండ్ అవుతుంది.

మహేష్‌.. గడ్డం, మీసంతో సీరియస్‌ లుక్‌లో ఉన్న స్టిల్‌ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ‘రాజసం’ అనే టైటిల్‌తో ఉన్న పోస్టర్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. మహేష్ నటిస్తున్న ఈ సినిమాకు రాజసం అనే టైటిల్ పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి. కాగా ఎక్కువ భాగం అమెరికాలో షూటింగ్‌ జరుపుకోనున్న ఈ సినిమాలో కామెడీ స్టార్‌ అల్లరి నరేష్ మరో కీలక పాత్రలో నటించనున్నారు. అశ్వనీదత్‌, దిల్‌ రాజులు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తుంది.

Author: admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *