
శంకర్ సినిమా అంటేనే భారి విజువల్స్ ఉంటాయి. శంకర్ దర్శకత్వంలో వచ్చిన రోబో చిత్రం ఎంతటి ఘనవిజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పక్కరలేదు. అయితే దీనికి సీక్వల్ గా వస్తున్నా చిత్రం రోబో 2 .ఓ. ఇటీవల విడుదలైన ‘2.0’ ట్రయిలర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఈ చిత్రం ట్రైలర్ ని చుసి టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు స్పందించారు.
ఈ చిత్రానికి సంబందించిన “విజువల్స్, కాన్సెప్ట్ అదిరిపోయాయి. రోబో చిట్టి చేసే విధ్వంసాన్ని స్క్రీన్ పై చూసేందుకు ఎదురుచూస్తున్నా. శంకర్, రజనీకాంత్ సార్, అక్షయ్ కుమార్, ఏఆర్ రహ్మన్, మీ టీమ్ మొత్తానికీ నా అభినందనలు” అంటూ మహేష్ బాబు అన్నారు. సినీ అభిమానులు ఈ సినిమా గురించి ఏంతగా ఉహించుకున్నారో, అంతకంటే ఎక్కువ విజువల్స్ ఎఫెక్ట్స్ ఈ ట్రయిలర్ లో కనిపించడంతో, అంచనాలు మరింతగా పెరిగిపోయాయి.
మహేష్ బాబు తన వ్యాఖ్యలని ట్వీట్ చేసాడు. ఇక మహేష్ బాబు ట్వీట్ పై అక్షయ్ కుమార్ స్పందించారు. దీన్ని రీట్వీట్ చేసిన అక్షయ్ ‘కృతజ్ఞతలు’ అని పేర్కొన్నారు. ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నా ఈ చిత్రాన్ని ఈ నెలాఖరులో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.