ఎన్టీఆర్ బ‌యోపిక్ హాట్ న్యూస్… ఆ పాత్ర‌కు అంగీక‌రించాడు.. కార‌ణం ఏంటో తెలుసా..!!

ఎన్టీఆర్ బయోపిక్ చిత్రీకరణ చివరికి చేరుకోవడంతో ఈమూవీ షూటింగ్ వేగం పెంచాడు క్రిష్. రెండు భాగాలుగా విడుదల కాబోతున్న ఈమూవీ పనులు అన్నింటినీ డిసెంబర్ రెండువ వారానికి పూర్తి చేసి ఆతరువాత ఈమూవీ ప్రమోషన్ చాల విస్తృతంగా చేయాలనీ క్రిష్ ఆలోచనలు చేస్తున్నట్లు సమాచారం. తెలుస్తున్న సమాచారం మేరకు ఈమూవీలోని మేకింగ్ విశేషాలను తెలియచేస్తూ కొన్ని ప్రముఖ తెలుగు ఛానల్స్ ఎన్టీఆర్ బయోపిక్ పై ప్రత్యేక కార్యక్రమాలు డిసెంబర్ చివరి నుండి ప్రసారం చేయడమే కాకుండా ఎన్టీఆర్ తో నటించి ఇప్పటికీ జీవించి ఉన్న అనేకమంది ఎన్టీఆర్ సన్నిహిత నటీనటులు అలనాటి దర్శకులతో ఎన్టీఆర్ వ్యక్తిత్వం పై అదేవిధంగా ఆయన నటనకు సంబంధించిన సమర్ధత పై అనేక ప్రత్యేక కార్యక్రమాలు క్రిష్ టీమ్ డిజైన్ చేస్తున్నట్లు సమాచారం.

ఇది ఇలా ఉండగా ఈమూవీలో కొన్ని సీన్స్ లో కనిపించే సూపర్ స్టార్ కృష్ణ పాత్రలో నటించ వలసిందిగా మహేష్ బాబు పై బాలయ్య తరపున క్రిష్ వ్యక్తిగతంగా ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం. ‘భరత్ అనే నేను’ మూవీలో మీసకట్టు పెట్టుకుని అచ్చం తన తండ్రి కృష్ణలా మహేష్ కనిపించిన నేపధ్యంలో అదే మ్యాజిక్ రిపీట్ చేస్తానని క్రిష్ మహేష్ పై ఒత్తిడి పెంచినట్లు తెలుస్తోంది.

అయితే క్రిష్ సూచనకు మహేష్ వెంటనే అంగీకారం తెలపకుండా కొంత ఆలోచించి తన నిర్ణయం చేపుతున్నాని చెప్పినట్లు వార్తలు వస్తున్నై. ఒకవేళ మహేష్ క్రిష్ సూచనకు అంగీకరించక పోతే ఎన్టీఆర్ బయోపిక్ లో అసలు కృష్ణ పాత్ర ప్రస్తావన లేకుండానే షూటింగ్ పూర్తి చేయాలని క్రిష్ భావించార‌నీ సమాచారం.. దీంతో క్రుష్ణ‌పాత్ర ఆల్ మొస్ట్ ముగిసిపోయింద‌ని అంతా అనుకున్నారు.

అయితే ఇది గ‌మ‌నించిన మ‌హేష్ బాబు ఎన్టీఆర్ లో చేసేందుకు అంగీక‌రించార‌ట‌. దీంతో సూప‌ర్ స్టార్ క్రుష్ణ‌పాత్ర‌లో మ‌హేష్ క‌నిపించ‌డం క‌న్ఫామ్ అయ్యింది. అటు బ‌య్య‌ర్లుకూడా ఈ నిర్ణ‌యం ప‌ట్ల సంత్రుప్తి వ్య‌క్తం చేసార‌ట‌. అటు మ‌హానాయ‌కుడి జీవిత చ‌రిత్ర. అందునా అగ్ర‌న‌టులంతా క‌నువిందుచేయ‌నున్నారు. దీంతో ఎన్టీఆర్ భ‌యోపిక్ సంచల‌నం స్రుష్టించుతుంద‌న‌డంలో ఆశ్చ‌ర్యంలేదు.

Author: admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *