మహేష్ బాబు మహర్షి మూవీ టాప్ సీక్రెట్ లీక్….

Mahesh Babu Movie Looks

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రధాన పాత్రలో వంశి పైడిపల్లి దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రం మహర్షి. ఇప్పటికే రిలీజ్ ఆయన ఈ చిత్రంలోని మహేష్ బాబు లుక్ అందరిని ఆకట్టుకుంది. ఈ చిత్రంలో మహేష్ సరసన హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. అయితే ఈ చిత్రం మొదటి షెడ్యూల్ డెహ్రాడూన్ లోని కాలేజ్ లో జరిగింది. ఇక రెండో షెడ్యూల్ ని గోవాలో కంప్లీట్ చేశారు.

ఇక ఈ చిత్రానికి సంబందించిన మూడో షెడ్యూల్ అమెరికాలో కంప్లీట్ చేసినట్లు తెలిసింది. అయితే ఈ షెడ్యూల్లో పూజా హెగ్డే పాల్గొనలేదని, ఆమెతో మహేష్ కి కాంబినేషన్ సీన్లు లేవని మేకింగ్ ఫోటోలని బట్టి సినీ విశ్లేషకులు నిర్ధారణకు వచ్చారు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న “మహర్షి” చిత్రానికి సంబంధించిన ఓ టాప్ సీక్రెట్ బయటికి వచ్చింది. అదేమిటంటే ఈ మూవీలో మహేష్ మూడు విభిన్న పాత్రలలో నటిస్తున్నాడట. అవి ఏమిటంటే కాలేజీ విద్యార్థిగా, సాఫ్ట్ వేర్ కంపెనీ ఓనర్ గా, రైతుగా కనిపించనున్నట్లు తెలిసింది.

ఇలా మూడు విభిన్న పాత్రలలో మహేష్ ని వంశీ చూపించబోతున్నట్లు ఫిలిం నగర్ టాక్. ఇప్పటికే మొదటి రెండు కోణాలకి సంబందించిన మహేష్ లుక్ బయటికి వచ్చి అందరిని విశేషంగా ఆకట్టుకుంది. ఇక రైతుగా ఎలా ఉండబోతారో అనేది ఆసక్తికరంగా మారింది. ఈ రైతు సన్నివేశాల చిత్రీకరణ కోసం రామోజీ ఫిలిం సిటీ లో అంతా సిద్ధం చేశారు. త్వరలోనే అక్కడ షూటింగ్ మొదలుకానుంది. ఈ చిత్రంలో అల్లరి నరేష్ ఓ ముఖ్య పాత్రలో నటిస్తున్నాడు. దిల్ రాజు, అశ్వినీదత్, పీవీపీ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. ఈ చిత్రాన్ని ఉగాది కానుకగా ఏప్రిల్ 5 న విడుదలచేయనున్నారు చిత్ర యూనిట్.

Author: admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *