మ‌రోసారి సావిత్రిగా కీర్తి?

మ‌హాన‌టి సావిత్రి జీవిత‌క‌థ ఆధారంగా తెర‌కెక్కిన `మ‌హాన‌టి` సినిమాలో న‌టించి మెప్పించింది కీర్తి సురేష్‌. సావిత్రి పాత్ర‌లో జీవించిన కీర్తి న‌ట‌న‌కు సామాన్యుల‌తోపాటు సెల‌బ్రిటీలు కూడా ఫిదా అయిన సంగ‌తి తెలిసిందే. త్వ‌ర‌లో ఆ మ‌హాన‌టి పాత్ర‌లో వెండితెర‌పై కీర్తి సురేష్ మ‌రోసారి క‌నిపించ‌బోతున్నార‌నే వార్త‌లు షికార్లు చేస్తున్నాయి.

విశ్వివిఖ్యాత న‌టుడు, మాజీ ముఖ్య‌మంత్రి నంద‌మూరి తార‌క రామారావు జీవిత‌క‌థ ఆధారంగా ఆయ‌న త‌న‌యుడు నంద‌మూరి బాల‌కృష్ణ `ఎన్టీయార్‌` బ‌యోపిక్‌ను తెర‌కెక్కిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాలో ఎన్టీయార్ పాత్ర‌లో బాల‌కృష్ణ న‌టిస్తున్నారు. ఈ సినిమాలో ఎన్టీయార్ సినీ జీవితం గురించి ప్ర‌ముఖంగా చూపించ‌బోతున్నారు. ఎన్టీయార్‌తో ప‌లు సినిమాల్లో న‌టించిన సావిత్రి పాత్ర కూడా ఈ సినిమాలో ఉంద‌ట‌. `మ‌హాన‌టి`లో సావిత్రిగా ఒదిగిపోయిన కీర్తి సురేష్‌నే ఈ సినిమాలోనూ సావిత్రి పాత్ర కోసం తీసుకోవాల‌ని ద‌ర్శ‌కుడు క్రిష్ భావిస్తున్నాడ‌ట‌. త్వ‌ర‌లోనే కీర్తిని క‌లిసి క‌థ వినిపించ‌బోతున్న‌ట్టు స‌మాచారం.

Author: admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *