
- వైకాపా ఎంపీల రాజీనామాలపై మంత్రి నారా లోకేశ్ విమర్శ
- భాజాపాతో కుమ్మక్కై ప్రజలను తప్పుదోవ పట్టించారు
- రాజీనామా నాటకానికి భాస్కర్ అవార్డ్స్ ఇవ్వాలని ఎద్దేవా
వైసీపీ ఎంపీల రాజీనామాలపై మంత్రి నారాలోకేష్ ట్విట్టర్లో స్పందించారు. ఏమి నటన…ప్రజలను మభ్యపెట్టి, బీజేపీతో కుమ్మక్కై ఉప ఎన్నికలు రాకుండా జాగ్రత్త పడ్డారని వ్యాఖ్యానించారు. రాజీనామాల డ్రామా ఆడిన వైసీపీ ఎంపీలకు ‘భాస్కర్’ అవార్డులు ఇవ్వాలని ఎద్దేవా చేశారు. ఈ రెండు పార్టీలు వారి సొంత కథతో ‘ఏ1…అర డజను దొంగలు’ సినిమా తీస్తే బాగుంటుందని ట్విట్టర్లో మంత్రి లోకేష్ వ్యంగ్ర్యాస్త్రాలు సంధించారు.
లోకేష్ కు కప్పం కడుతూ అందినంత దండుకుంటున్నారు!: యరపతినేనిపై అంబటి ఆరోపణ
- సహజవనరులను దోచుకుంటున్న ఘనత యరపతినేనిదే!
- అందినకాడికి యరపతినేని దండుకుంటున్నారు!
- ఎక్కడా లేని విధంగా గురజాలలో దోపిడీ జరుగుతోంది
గుంటూరు జిల్లా గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాస్ పై వైసీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఆరోపణలు గుప్పించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, సహజవనరులను దోచుకుంటున్న ఘనత యరపతినేనిదేనని ఆరోపించారు. మంత్రి నారా లోకేష్ కు కప్పం కడుతూ అందినకాడికి యరపతినేని దండుకుంటున్నారని, ఇంత దోపిడీ జరుగుతున్నప్పటికీ అధికారులు చోద్యం చూస్తున్నారే తప్ప, ప్రశ్నించడం లేదని మండిపడ్డారు. ఎక్కడా లేని విధంగా గురజాలలో దోపిడీ జరుగుతోందని అంబటి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.