ఆ ప్రముఖ డైరెక్టర్ ని చెప్పుతో కొట్టా..’ఖుషీ ఫేం ముంతాజ్ ‘

Kushi pame mumtaj hit a director with slipper

‘మీటూ’ భారత్ లో రోజురోజుకి ఉధృతమవుతున్న ఉద్యమం. ఈ ఉద్యమం పుణ్యమా అని చాలా మంది నటీమణులు తాము ఎదుర్కొన్న లైంగిక వేధింపుల గురించి బహిరంగంగా వెల్లడించారు. దీనికి శ్రీ రెడ్డి ఆజ్యంపోయగా అది ఇంకా రగులుతూనే ఉంది.

తాజాగా మరో నటి తన కెరీర్ లో ఎదుర్కున్న పరిస్థితుల గురించి వెల్లడించింది. ఆ నటి ఎవరో కాదు ‘ఖుషీ’ , అత్తారింటికి దారేది ఫేం ముంతాజ్. నా కెరీర్ లో కూడా అలాంటి చేదు అనుభవాలు చాలానే ఎదురయ్యాయి. నాతో తప్పుగా ప్రవర్తించినందుకు ఓ దర్శకుడిని చెప్పుతో కొట్టాను. ఈ విషయాన్ని నడిగర్ సంఘం దృష్టికి తీసుకువెళ్లగా.. వారు నా సమస్యని పరిష్కరించారు అని చెప్పుకొచ్చింది.

ఆ తరువాత కూడా మరో దర్శకుడు తనతో అసభ్యంగా ప్రవర్తించాడు. అప్పుడు కోపం ఆపుకోలేక నోటికొచ్చినట్లు తిట్టేశాను. అంతే ఇక అప్పటినుండి ఆయన నా జోలికి రాలేదు” అంటూ చెప్పుకొచ్చింది ముంతాజ్. రీసెంట్ గా తమిళ ‘బిగ్ బాస్2’ తో మంచి క్రేజ్ తెచ్చుకున్నారు ముంతాజ్

ఆ తరువాత “మీటూ” ఉద్యమంపై తన అభిప్రాయాన్ని వెల్లడించింది.. ”ఒకరు మంచివారో, చెడ్డవారో నిర్ణయించే హక్కు మనకి లేదు.. ఆరోపణలు వచ్చినప్పుడు బాధితులు, బాధ్యులు ఇద్దరి మాటలు వినాలి. అప్పుడే ఫలితం ఉంటుందని” అన్నారు. ఆమె చెప్పింది కరెక్ట్ గానే ఉందని విశ్లేషకులు అంటున్నారు. అనోసరంగా స్టార్ హీరోలు, డైరెక్టర్స్ మీద అబాండాలు వేయడం తగదని, ఇద్దరి వాదనలు విన్న తరువాత డెసిషన్ తీసుకోవడం మంచిదని వారు అంటున్నారు

Author: admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *