కిరణ్ కుమార్ రెడ్డి రీఎంట్రీ ఆ పార్టీతోనేనా

ఉమ్మడి ఆంధ్ర రాష్ట్ర చివరి ముఖ్యమంత్రిగా పని చేసిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి , రాష్ట్రం విడిపోయిన తరువాత కాంగ్రెస్ నుండి వైదొలిగి తానే జై సమైఖ్యాంధ్ర పార్టీ నెలకొల్పి 2014 సార్వత్రిక ఎన్నికలలో డిపాసిట్లు కూడా దక్కించుకోలేకపోయారు . ఆ ఎన్నికల తరువాత ఒకటి ,రెండు సార్లు మినహా మీడియాకు కూడా కనిపించలేదు . ఆయన ఈ నాలుగేళ్ల పాటు ఏంచేశారు అనేది ఎవరికీ తెలియలేదు .

Related image అయితే ఇప్పుడు మళ్ళీ ఆయన పేరు తెర మీదకు వచ్చింది . ఆయన తిరిగి రాజాకీయాల్లోకి రావాలనుకుంటున్నారని పొలిటికల్ వర్గాల సమాచారం . గతంలో ఆయన బీజేపీ ,టీడీపీ, వైసీపీలోకి లేదా జనసేనలోకి చేరుతున్నారని వార్తలు వచ్చాయి .
అయితే ఇప్పుడు ఆయన పాత గూటికె చేరతారని వార్తలు వినపడుతున్నాయి .

Image result for kiran kumar reddyకిరణ్ కుమార్ రెడ్డి ఇటీవల ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తో ఆయన తిరిగి కాంగ్రెస్ లోకి రావడం పై చర్చలు జరిపారని , రాహుల్ ఆయన రాకకు సుముఖుత వ్యక్తం చేసి ఏపీసీసీ బాద్యతలు ఆయనకు అప్పగించడం పై ఆలోచనలో పడ్డట్టు తెలుస్తోంది . ఈ విషయం పై ఏపీ కాంగ్రెస్ ఇంచార్జ్ ఊమెన్ చాందీ కూడా కిరణ్ రాకకు సుముఖత వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది .

Image result for kiran kumar reddyఇటీవలే తన సొంత ఊరు నగిరిపల్లి నుండి వచ్చిన కిరణ్ కుమార్ రెడ్డి తిరిగి కాంగ్రెస్ లో కి చేరితే ఎలా ఉంటుందనే విషయం పై తన సన్నిహితులను అడిగినట్టు తెలుస్తోంది . అయితే ఆయన తిరిగి వస్తే ఏపీ పగ్గాలు ఆయనకు అప్పగించే ఆలోచన కాంగ్రెస్ అధిష్ఠానం చేస్తునట్టు తెలుస్తోంది . కానీ కిరణ్ కుమార్ రెడ్డి సోదరుడు టీడీపీలో ఉండడం పై ఒకవేళ అదే జరిగితే ఇబ్బందులు కలిగే అవకాశం లేకపోలేదు .

Author: admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *