
వజ్రాలు పొదిగిన..!
దుర్గమ్మకు కానుకగా సీఎం కేసీఆర్ ఇచ్చే ముక్కుపుడకను చెన్నైలోని జీఆర్టీ జ్యువెలర్స్‌లో తయారు చేశారు. బరువు 11.96 గ్రాములు. ఇందులో 55 చిన్న చిన్న డైమండ్ ముక్కల్ని వినియోగించారు. మధ్యలో తెలంగాణ రాష్ట్ర పక్షి పాలపిట్ట బొమ్మను అందంగా తీర్చిదిద్దారు. తయారీ కోసం రూ. కోటి 22లక్షలు వెచ్చించారు.
విజయవాడ కనక దుర్గమ్మకు మొక్కు చెల్లించుకున్నారు తెలగాణ సీఎం కేసీఆర్. కుటుంబ సమేతంగా ఆలయానికి చేరుకున్న కేసీఆర్‌కు ఆలయ అధికారులు ఘనస్వాగతం పలికారు. పూర్ణకుంభంతో ఆలయ అర్చకులు స్వాగతం పలికారు. అమ్మవారికి పట్టు వస్త్రాలు, ముక్కు పుడక సమర్పించారు. ముక్కు పుడకను 11.29 గ్రాముల బంగారంతో తయారు చేయించగా.. దానిలో 57 వజ్రాలున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక దుర్గమ్మకు ముక్కు పుడక సమర్పిస్తానని కేసీఆర్ మొక్కుకున్న విషయం తెలిసిందే.
అంతకుముందు సీఎం కేసీఆర్‌కు గన్నవరం ఎయిర్ పోర్టులో ఏపీ మంత్రి దేవినేని ఉమ స్వాగతం పలికారు. కేసీఆర్‌తో పాటు నాయిని, కేకే, ఇంద్రకరణ్ రెడ్డి, వేముల తదితరులు ఉన్నారు.