
హైదరాబాద్: విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గ అమ్మవారిని తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు దర్శించుకోనున్నారు. ఉద్యమ సమయంలోని మొక్కులను తీర్చుకునేందుకు ఆయన తన కుటుంబ సభ్యులతో కలిసి విజయవాడ వెళ్తున్నారు. బేగంపేట విమానాశ్రయం నుంచి కేసీఆర్ కుటుంబం ప్రత్యేక విమానంలో విజయవాడ చేరుకుంటుంది. ఆ తర్వాత అక్కడినుంచి రోడ్డుమార్గాన ఇంద్రకీలాద్రిపైకి చేరుకుంటారు. సీఎం కేసీఆర్ పర్యటన నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తోంది. ఏపీ సీఎం చంద్రబాబు ఈ మేరకు అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
కేసీఆర్ గతంలో ఏపీ రాజధాని అమరావతి నగర భూమి పూజకు ప్రధాని మోదీతో కలిసి హాజరయ్యారు. ఆ సమయంలో ఏపీ ప్రజల నుంచి కేసీఆర్కు ఘన స్వాగతం లభించింది. ప్రస్తుత పర్యటనను కూడా ఆంధ్రులు ఆసక్తిగా గమనిస్తున్నారు.