
తెలంగాణలో ముందస్తు ఎన్నికల వేళ రాజకీయ పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ప్రచారంలో దూసుకుపోతున్న అధికార, ప్రతిపక్షపార్టీల నేతలు పరస్పరం విమర్శనాస్త్రాలు సంధిస్తూ ఎన్నికల వేడిని మరింత పెంచుతున్నారు. తాజాగా కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ విజయశాంతి తెరాస అధినేత, సీఎం కేసీఆర్పై వ్యంగ్య బాణాలు సంధించారు. ఎన్నికల్లో తెరాసకు వంద సీట్లు రావడం కాదు.. ఎన్నికల ఫలితాల తర్వాత సీఎం కేసీఆర్కు 104 జ్వరం వస్తుందని వ్యాఖ్యానించారు. ఈ మేరకు విజయశాంతి ఓ ప్రకటన విడుదల చేశారు. మహాకూటమి పొత్తుల్లో భాగంగా భాగస్వామ్య పార్టీలు గెలిచేందుకు స్థానాలను అడగాలి తప్ప కాంగ్రెస్ గెలిచే స్థానాలను అడగొద్దని ఆమె సూచించారు.