
టాలీవుడ్ లో తొలి బయోపిక్‌గా రూపొందిన చిత్రం మహానటి.యువ దర్సకుడు నాగ్ అశ్విన్ రూపొందిన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకోవడమే కాకుండా సావిత్రి ఫ్యామిలీ నుండి కూడా అప్లాజ్ అందుకుంది. కాని జెమినీ గణేషన్ కూతురు,ప్రముఖ వైద్యురాలు కమలా సెల్వరాజ్ మాత్రం చిత్రంపై అసంతృప్తి వ్యక్తం చేయడం గమనర్హం. చిత్రంలో తన తండ్రిని తప్పుగా చూపించారని కమలా ఆరోపించారు. ఎంతో బిజీగా ఉండే తన తండ్రిని అవకాశాలు లేక ఖాళీగా ఉన్నట్టు చూపించారు. తండ్రి పాత్రని తప్పుగా చిత్రీకరించి ఆయనకు కళంకం తీసుకొచ్చారు అని కమలా సెల్వరాజ్ తెలిపింది.
సావిత్రి కంటే ముందే తన తల్లిని జెమినీ గణేషన్ వివాహం చేసుకున్నాడని, ఇద్దరు పిల్లలని కూడా కన్నారని గుర్తు చేసుకున్నారు కమలా సెల్వరాజ్. నాన్నకి సావిత్రి మద్యం అలవాటు చేశారనేది అవాస్తవం, సావిత్రే తన తండ్రికి మద్యం అలవాటు చేసిందని ఆమె పేర్కొన్నారు. జెమినీ గణేషన్‌ని ప్రేక్షకులు ఆదరించకుంటే ‘కాదల్ మన్నన్’ (ప్రేమరాజు) అనే బిరుదు ఎందుకిస్తారని ఆమె ప్రశ్నించారు. ప్రాప్తం చిత్ర నిర్మాణం చేయాలన్న పంతంతో ఉన్న సావిత్రి నిర్ణయాన్ని వెనక్కు తీసుకోమని చెప్పడానికి నాన్నతో కలసి తానూ ఆమె ఇంటికి వెళితే తమపై కుక్కను ఉసిగొల్పి గెంటేశారని, తాము కుక్క బారి నుంచి తప్పించుకోవడానికి గోడ దూకి పారిపోవలసి వచ్చిందన్నారు. ఆ సంఘటన తరువాత నాన్న మళ్లీ సావిత్రి ఇంటికి వెళ్లలేదని కమలా సెల్వరాజ్ చెప్పారు.