ఎన్టీఆర్ కి ఖరీదైన కానుకను ఇచ్చిన కల్యాణ్ రామ్

క్రితం నెల 20న ఎన్టీఆర్ పుట్టినరోజు
యూరప్ నుంచి గిఫ్ట్ తెప్పించిన కల్యాణ్ రామ్
మురిసిపోతోన్న ఎన్టీఆర్

మే 20వ తేదీన ఎన్టీఆర్ పుట్టినరోజు వేడుక జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకి కల్యాణ్ రామ్ ఒక ఖరీదైన కానుకను ఇచ్చారు. ఎన్టీఆర్ కి రిస్ట్ వాచ్ లంటే చాలా ఇష్టమట. అందువలన ఆయన రకరకాల రిస్ట్ వాచ్ లు వాడుతూ ఉంటాడు. ఈ కారణంగానే ఆయనకి ఒక ఖరీదైన రిస్ట్ వాచ్ ను కల్యాణ్ రామ్ కానుకగా ఇచ్చాడట.

 యూరప్ నుంచి ఆయన ఆ వాచ్ ను తెప్పించినట్టుగా సమాచారం. అయితే ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తన సోదరుడు ఇచ్చిన కానుకను ఎన్టీఆర్ ఎంతో అపురూపంగా చూసుకుంటున్నాడట. గతంలో ఎన్టీఆర్ హీరోగా కల్యాణ్ రామ్ నిర్మించిన ‘జై లవ కుశ’ మంచి లాభాలను తెచ్చిపెట్టిన విషయం తెలిసిందే. ఈ ఇద్దరి కాంబినేషన్లో మరో సినిమా రావాలని అభిమానులు ఆశిస్తున్నారు. కల్యాణ్ రామ్ కూడా ఆ దిశగా ఆలోచన చేస్తున్నట్టుగా ఫిల్మ్ నగర్లో చెప్పుకుంటున్నారు.

Author: admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *