ఎన్టీఆర్ బయోపిక్ లో jr ఎన్టీఆర్ వాయిస్ ఓవర్?

JrNTR Voice over in NTRBio pic movie

క్రిష్ దర్శకత్వంలో ఎన్టీఆర్ బయోపిక్ రూపొందుతోంది. మొదటిభాగమైన ‘కథానాయకుడు’కి సంబంధించిన సన్నివేశాలను .. పాటలను చకచకా చిత్రీకరిస్తున్నారు. ఇప్పటికే ఈ భాగానికి సంబంధించిన చిత్రీకరణ చాలావరకూ పూర్తయింది. ఈ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్రను యంగ్ ఎన్టీఆర్ పోషించనున్నట్టు వార్తలు వస్తున్నాయి.

Image result for NTRjr
అయితే మొదటిభాగం చిత్రీకరణ దాదాపు ముగింపు దశకి చేరుకున్న సందర్భంగా ఇక యంగ్ ఎన్టీఆర్ చేసే ఛాన్స్ లేదనే టాక్ బలంగా వినిపిస్తోంది. ఈ సినిమాలో ఆరంభంలో ఎన్టీ రామారావు గురించిన వాయిస్ ఓవర్ ఉంటుందట.Related image

ఆ వాయిస్ ఓవర్ ను యంగ్ ఎన్టీఆర్ తో చెప్పించాలనే ఆలోచనలో టీమ్ ఉందని అంటున్నారు. అదే జరిగితే ఈ సినిమాకి అది ప్రత్యేకమైన ఆకర్షణ అవుతుందని అంటున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 9వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు.ఈ సినిమాలో శ్రీదేవిగా రకుల్ .. జయప్రదగా తమన్నా కనిపించనున్న సంగతి తెలిసిందే.

Author: admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *