భ‌ర‌త్ అనేనేను లో గ‌వ‌ర్న‌ర్ పాత్ర‌లో జూనియ‌ర్ ఎన్టీఆర్….?

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు భ‌ర‌త్ అనేనేను ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్ కు పెద్ద‌గా టైమ్ లేదు. రేపు సాయంత్రం హైద‌రాబాద్ ఎల్బీ స్టేడియంలో భ‌ర‌త్ అనేనేను ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్ భారీ బ‌హిరంగ స‌భ‌లా జ‌ర‌గ‌బోతోంది. ఇందుకోసం ఏకంగా స్టేడియంలో అసెంబ్లీ సెట్ నే వేశారు. రెండు రాష్ట్రాల నుంచి భారీగా అభిమానులు త‌ర‌లి రాబోతున్నారు. అయితే ఈ బ‌హిరంగ స‌భ‌కు మ‌హేష్ బాబు కంటే కూడా స్పెష‌ల్ ఎట్రాక్ష‌న్ యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్.. అన‌డంలో ఏ డౌటూ లేదు. నిజానికి ఇలా ఓ పేద్ద స్టార్ ఫంక్ష‌న్ కు మ‌రో పేద్ద స్టార్ రావ‌డం టాలీవుడ్ లో వెరీ రేర్. ఇప్పుడా రేర్ ఫీట్ ను చేయ‌బోతున్నారు మ‌హేష్ బాబు, ఎన్టీఆర్.. అయితే ఎన్టీఆర్ ను కొర‌టాల శివ ఈ ఫంక్ష‌న్ కు చాలా ప్ర‌త్యేకంగా పిలిచాడు. ఆ ప్ర‌త్యేక‌త వ‌ల్లే మ‌హేష్ బాబు కూడా నో చెప్ప‌లేక‌పోయాడు.. నిజానికి అదెంత ప్ర‌త్యేక‌మైన విష‌యం అంటే.. ఓ కొత్త ట్రెండ్ ను సెట్ చేయ‌బోతోన్న స్పెష‌ల్ ఫంక్ష‌న్. అయితే ఈ స్పెష‌ల్ ఫంక్ష‌న్ లో ఎన్టీఆర్ ఏం చేయ‌బోతున్నాడో తెలుసా..?

భ‌రత్ అనేనేనులో మ‌హేష్ బాబు ముఖ్య‌మంత్రిగా న‌టించాడు అని అంద‌రికీ తెలిసిందే. అయితే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఆయ‌న అసెంబ్లీలోకి అడుగుపెట్టే టైమ్ కంటే ముందే ప్ర‌మాణ స్వీకారం చేసే స్పెష‌ల్ ఒక‌టి ఉంటుంది. సో.. మ‌హేష్ బాబుతో ప్ర‌మాణ స్వీకారం చేయించేది యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్.. య‌స్.. ఎన్టీఆర్ మ‌హేష్ బాబుతో ప్ర‌మాణ స్వీకారం చేయించ‌బోతుండ‌ట‌మే ఈ ఫంక్ష‌న్ లో అన్నిటికంటే హైలెట్ గా నిల‌వ‌బోయే అంశం. ముఖ్యమంత్రితో ప్ర‌మాణం చేయించేది నిజంగా కూడా గ‌వ‌ర్న‌రే క‌దా. ఇప్పుడా గ‌వ‌ర్న‌ర్ పాత్ర‌నే భ‌ర‌త్ కోసం ఎన్టీఆర్ చేయ‌బోతున్నాడు. నిజంగానే ఎన్టీఆర్ అభిమానులు ఆయ‌న్ని సిఎమ్ క్యాండిడేట్ గా చూస్తారు. అలాంటి యంగ్ టైగ‌ర్ ఇప్పుడు సినిమా సిఎమ్ కోసం గ‌వ‌ర్న‌ర్ అవ‌తారం ఎత్త‌బోతున్నాడ‌న్న‌మాట‌. మ‌రి ఈ వేడుక లైవ్ లో చూస్తే ఎంత క‌న్నుల పండువ‌గా ఉంటుందో వేరే చెప్ప‌క్క‌ర్లేదేమో..

Author: admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *