ఎన్టీఆర్ టైటిల్ ‘అరవింద సమేత’ కాదు: మహేష్ కోనేరు

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబోలో సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా ఈ సినిమా టైటిల్‌, ఫస్ట్‌లుక్‌ను చిత్రబృందం రిలీజ్ చేసింది. టైటిల్‌ క్యాచిగా.. డిఫరెంట్‌గా ఉండటంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఈ సినిమాకు అరవింద సమేత అని టైటిల్ పెట్టిన విషయం తెలిసిందే. ఈ సినిమా టైటిల్ ప్రకటించిన వెంటనే సోషల్ మీడియాలో అనూహ్య స్పందన వచ్చింది.

మలయాళంలో ఇదే టైటిల్, ఫస్ట్‌లుక్‌తో ఓ పోస్టర్ రిలీజ్ అయింది. అయితే దీనిని ఖండిస్తూ మహేష్ కోనేరు ఓ ట్వీట్ పెట్టారు. ‘‘ఇది ‘అరవింద సమేత’ అఫీషియల్ మలయాళం మూవీ పోస్టర్ కాదు.

Image result for aravindha samantha veera raghava

వైరల్ అవుతున్న ఈ టైటిల్ ఫేక్. ఈ సినిమా గురించి ఒకవేళ ఏమైన అఫీషియల్ అనౌన్స్‌మెంట్స్ వస్తే.. అవి ‘హారికా హాసిని’ ద్వారానే వస్తాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఫుల్ స్పీడ్‌గా నడుస్తోంది’’ అని ట్వీట్‌లో మహేష్ పేర్కొన్నారు.

Author: admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *