
Andhra Pradesh Information Technology Academy to hold job mela to recruit 1,000 women
విజయవాడ: జిల్లా ఉపాధి కార్యాలయం ఆధ్వర్యంలో ఈ నెల 22 వ తేదీ నుంచి 25 వరకు జాబ్మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి అధికారి డా. పి. రమేష్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఏజీఎస్ సంస్థలో పోస్టులను భర్తీ చే యడానికి జాబ్మేళా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ఇంటర్ లేదా డిగ్రీ ఉత్తీర్ణత సాధించి, వయోపరిమితి 18 నుంచి 30 సంవత్సరాలు ఉండాలన్నారు. విజయవాడ అర్బన్ పరిసర ప్రాంతాల వారికి ప్రాధాన్యత ఉంటుందన్నారు. ఎంపికయిన వారు మఽధ్యాహ్నం 3 నుంచి అర్ధరాత్రి 12 వరకు లేదా సాయంత్రం 4 నుంచి తెల్లవారుజాము ఒంటిగంట వరకు షిఫ్టులలో పనిచేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు.
ఆసక్తిగల వారు ఈ నెల 22 నుంచి 25వ తేదీ వరకు ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటలలోపు శ్రీ రామచంద్రపురంలోని రెనాల్డ్స్ షోరూం పక్కన ఉన్న సీఎస్ఆర్ కాంప్లెక్సు, 4వ అంతస్థు, ఏజీఎస్ సంస్థ కార్యాలయంలో జరిగే ఇంటర్వ్యూలకు హాజరవ్వాలని సూచించారు.