
Jeevitha Rajasekhar Sent Hostel Girls To Her Husband Bed: Sandhya Social Activist | Mahaa Entertai
టాలీవుడ్ నటి మాధవి లత పేస్ బుక్ లో పెట్టిన పోస్ట్ సినీ వర్గాల్లో హాట్ టాపిక్ అవుతోంది. అసలు మ్యాటర్ లోకి వెలితే ఇండస్ట్రీలో ఉన్న కష్టాలు గురించి ఆమె పోస్టు పెడుతూ.. ఇది భయం కాదు మా బతుకు… ప్రేమతో వచ్చాం చావైనా రేవైనా ఇక్కడే జరిపోయేదిలేదు, పారిపోవడం అంతకన్నలేదు, కామం కాటికి కాలు చాపిన ముసలి వాడి కళ్ళలో కూడా జ్వలిస్తూనే ఉంది అయినా బదిలీ ఔదామంటే అది లేనిదెక్కడా..
ఒక్క సినీ రంగమేనా.. బతకాలంటే బరితెగించాలి లేదా బాధను దిగమింగాలి.. చీకటిలో నలిగి పోయిన చెప్పకోలేని కథలు, విప్ప లేని ముడులు ఎన్నో, కన్నీళ్ళతో కష్టం తీరిపోతే ఇన్నాళ్లుగా ఈ భాధలెందుకు.. ఏరి కోరి వచ్చినందుకు పక్కలోకి చేరుకోవడం తప్పడం లేదు అయిన మాకు ఈ సినిమా పిచ్చి మాకు ఇష్టం.. మిమ్మల్ని నవ్వించాడానికి మేము నవ్వుల పాలు కాక తప్పడం లేదు… అయినా మాకు సినిమా ఇష్టం.. మేము చచ్చే వరకు మిమ్మల్ని ఆనందపెట్టడానికి మేకప్ తో వస్తూనే ఉంటామని తన పేస్ బుక్‌లతో రాసుకొచ్చింది మాధవి.