మహానాడులో జగన్ ని ఉతికి ఆరేసిన జేసీ దివాకర్ రెడ్డి

వీడి నాయనకే భయపడలేదు…. ఇప్పుడు వీడి కాళ్లు మొక్కుతానా?
నారా లోకేష్ ముఖ్యమంత్రి అయితే తప్పేంటని ప్రశ్నించారు అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి. తన ఆస్తి తన కుమారుడు పవన్‌కే దక్కుతుందని…. అలాగే టీడీపీకి కూడా నారా లోకేషే నాయకుడని చెప్పారు.

పోలవరం ముడుపులు వైఎస్ జగన్‌కే అందాయని జేసీ ఆరోపించారు. పోలవరంలో అవినీతి కాంగ్రెస్‌ హయాంలోనే జరిగిందన్నారు. చంద్రబాబు బోల్తాపడలేదని…. బోల్తా పడినట్టు నటించారని జేసీ చెప్పారు. దీనిపై తాను చంద్రబాబును అడిగితే…. ఏం చేస్తాం జేసీ…. మోడీ పైన అధికారంలో ఉన్నారంటూ వ్యాఖ్యానించారని గుర్తు చేశారు.

Image result for MP JC Diwakar Reddy

ఆంధ్రుల ఆత్మగౌరవం కోసం పుట్టిన పార్టీ టీడీపీ అని కొనియాడారు 2014లో టీడీపీలో చేరిన జేసీ. ఎన్ని ఏళ్లు గడిచినా మహాత్మగాంధీని మరిచిపోలేమని.. అలాగే చంద్రబాబు కూడా పేరు కోసం తపిస్తున్నారన్నారు. నేను జగన్‌ నాన్న వైఎస్‌కే భయపడలేదని…. ఇప్పుడు వీడికి వెళ్లి కాళ్లు మొక్కాలా అని జేసీ వ్యాఖ్యానించారు.

Image result for MP JC Diwakar Reddy

ఆ తరువాత ప్రభుత్వం మీద పడ్డ జేసీ…. టెలికాన్ఫరెన్స్‌లు మానుకోకపోతే పరిస్థితులు మరోలా ఉంటాయన్నారు. ప్రతోడు టెలికాన్ఫరెన్స్ అంటున్నారని.. ఏనాకొడుకు దొరకడం లేదని జేసీ వ్యాఖ్యానించారు. జన్మభూమి కమిటీలపైనా తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

Related image

మరోసారి చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నానని…. అలా కావాలంటే జన్మభూమి కమిటీలు ఉండకూడదన్నారు. అవి కొంపముంచుతున్నాయన్నారు. అందరూ చంద్రబాబు వద్ద చప్పట్లు కొట్టేవారే గానీ అసలు పరిస్థితి వివరించడం లేదన్నారు.

ఈ సమయంలో ఎంపీ రామ్మోహన్‌ నాయుడు వచ్చి జేసీ నుంచి మైకు తీసుకునే ప్రయత్నం చేశారు. కానీ జేసీ మాత్రం వెనక్కు తగ్గలేదు.

Author: admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *