జనసేన చూపు ఆ నాలుగైదు స్థానాల వైపు

జనసేన అన్ని నియోజకవర్గాలలోనూ పోటీ చేస్తుందని ఇప్పటికే ప్రకటించిన పవన్‌కల్యాణ్‌.. ఆ పార్టీకి కీలకమైన ఓటు బ్యాంక్‌గా భావిస్తున్న తూర్పుగోదావరి జిల్లాపై దృష్టి సారించారు. అన్నిచోట్లా అభ్యర్థులను బరిలోకి దించినా, వచ్చే ఎన్నికలలో నాలుగైదు అసెంబ్లీలలో మాత్రం తమ సత్తా చాటాలని భావిస్తున్నారు. ఈ మేరకు ఆ పార్టీ వ్యూహకర్తలు ప్రణాళికలు సిద్ధం చేసే పనిలో నిమగ్నమైనట్టు సమాచారం. తుని, పిఠాపురం, జగ్గంపేట, కొత్తపేట నియోజకవర్గాలపై తొలి దశలో ఫోకస్‌ పెట్టేందుకు కసరత్తు ప్రారంభించినట్టు తెలుస్తోంది. ఈ నాలుగు నియోజకవర్గాల్లో జనసేన తరపున ఎవరిని బరిలోకి దింపాలన్నదానిపై ఇప్పటికే ప్రాథమిక సర్వే కూడా నిర్వహించినట్టు చెప్తున్నారు. టీడీపీ, వైసీపీ అభ్యర్థులకు ధీటైన వారిని పోటీకి దింపాలని యోచిస్తున్నారు. 2009లో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నపుడే పీఆర్పీకి వచ్చిన 18 సీట్లలో తూర్పుగోదావరి జిల్లా నుంచే నాలుగు సీట్లు దక్కాయి.

Image result for praja rajyam party chiri

ఈసారి ఇక్కడ త్రిముఖమే
పిఠాపురం, పెద్దాపురం, కాకినాడ రూరల్‌, కొత్తపేట నుంచి ప్రజారాజ్యం అభ్యర్థులు గెలుపొందారు. తర్వాత ఆ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసినా.. పవన్‌కల్యాణ్‌ అభిమానులు, కేడర్‌.. కాంగ్రెస్‌లోకి వెళ్లలేదు. వారంతా ఇపుడు జనసేనకు మద్దతుగా నిలవాలని ముందుకు వస్తున్నారు. ఈ నేపథ్యంలో పవన్‌కల్యాణ్‌ ఈ జిల్లాపై ఎక్కువ ఆశలు పెట్టుకున్నారు. దీంతో తుని, పిఠాపురం, జగ్గంపేట, కొత్తపేట నియోజకవర్గాలలో ధీటైన అభ్యర్థులను బరిలోకి దింపి.. టీడీపీ, వైసీపీలకు బలమైన పోటీ ఇవ్వా లని జనసేన ఉవ్విళ్లూరుతోంది. వైసీపీతో పొత్తులేకుండా జనసేన విడిగా పోటీచేసే పక్షంలో పై నాలు గు నియోజకవర్గాలలో త్రిముఖ పోరు నెలకొనే అవకాశం ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మిగిలిన నియోజకవర్గాలలోనూ బలమైన అభ్యర్థులు పోటీకి ముందుకు వస్తే అక్కడ కూడా పోటీకి నిలపాలన్నది జనసేన యోచనగా కన్పిస్తోంది.

 

బలమైన రాజకీయ శక్తిగా ఎదగాలని..
గెలుపు, ఓటమిల విషయం పక్కనపెడితే జిల్లాలో 2019 ఎన్నికల నాటికి బలమైన రాజకీయ శక్తిగా ఆవిర్భవించాలని జనసేన వ్యూహాలు రచిస్తోంది. ఆ పార్టీ కీలక నేత మారిశెట్టి రాఘవయ్య ఇప్పటికే జిల్లాలో పలుమార్లు పర్యటించారు. జిల్లాకు చెందిన ఒక ప్రముఖ జర్నలిస్టు జనసేన ప్రధాన కార్యాలయంలో ఐదారు నెలల నుంచి కీలకంగా వ్యవహరిస్తున్నారు. జిల్లాలో ఆ పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలపై ఇప్పటికే కార్యాచరణ రూపొందించుకున్నట్లు తెలుస్తోంది.

Related image

ఈనెల 20 తర్వాత పవన్‌ టూర్‌..
జిల్లాలో ఈనెల 20 తర్వాత జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ పర్యటన ఉంటుందని ఆ పార్టీ నేతలు చెప్తున్నారు. ప్రస్తుతం విశాఖ పర్యటనలో ఉన్న పవన్‌.. ఈనెల 20 వరకు అదే జిల్లాలో పర్యటిస్తారని సమాచారం. జిల్లాలో పవన్‌ కల్యాణ్‌ 15 రోజులపాటు పర్యటిస్తారని సమాచారం. ఈ పర్యటనకు ముందే జిల్లాలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితులు, అధికార టీడీపీ ప్రజాప్రతినిధుల, నేతలపై వచ్చిన ఆరోపణలపై కొంత సమాచారం సేకరిస్తున్నారు. అధికార పార్టీ నేతలు అక్రమాలకు పాల్పడుతున్నారంటూ పవన్‌కల్యాణ్‌ కొంతమందిని ఈ జిల్లా పర్యటనలో టార్గెట్‌ చేయనున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఈ మేరకు పార్టీ యంత్రాంగంతోపాటు.. ప్రైవేటు వ్యక్తులతోనూ కొంత సమాచారం సేకరించినట్టు తెలుస్తోంది.

Author: admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *