వర్షం లోనే జగన్‌ పాదయాత్ర

వర్షం లోనే జగన్‌ పాదయాత్ర:182వ రోజు…తణుకు నుంచి నడిపల్లి దాకా
పశ్చిమ గోదావరి: వైసిపి అధినేత వైఎస్ జగన్ ప్రజాసంకల్పయాత్ర ప్రస్తుతం పశ్చిమగోదావరి జిల్లాలో కొనసాగుతోంది. జగన్‌ బుధవారం తన 182 వ రోజు పాదయాత్రను తణుకు శివారు నుంచి ప్రారంభించారు.

మరో చరిత్ర సృష్టించనున్న జగన్ ప్రజాసంకల్పయాత్ర అయితే ఈ ఉదయం నుంచే తణుకులో భారీ వర్షం కురుస్తుండగా పాదయాత్ర ఆరంభానికి ఆటంకం ఏర్పడింది. అయితే వేచిచూసినా వర్షం తగ్గకపోతుండటంతో జగన్ వర్షంలోనే తన పాదయాత్రను కొనసాగించారు. వర్షంలో నడక సాగిస్తున్న జగన్ ను ఆ పార్టీ కార్యకర్తలు, అభిమానులు అనుసరిస్తుండగా తనని కలసి మాట్లాడేందుకు వస్తున్న జనాల సమస్యలు తెలుసుకుంటూ జగన్ పాదయాత్ర కొనసాగిస్తున్నారు.

జగన్ 182 వ రోజు ప్రజాసంకల్ప యాత్ర తణుకు శివారు నుంచి మొదలై పాదయాత్ర నిడదవోలు నియోజకవర్గంలోకి ప్రవేశించనుంది. ఉండ్రాజవరం మండలం పాలంగి, ఉండ్రాజవరం మీదుగా చిలకపాడు క్రాస్‌ రోడ్డు చేరుకున్న తర్వాత అక్కడ జగన్‌ భోజన విరామం తీసుకోనున్నారు. ఆ తర్వాత మోర్తా, దమ్మెన్ను మీదుగా నడిపల్లి కోట చేరుకున్న తర్వాత నేటి పాదయాత్ర ముగియనుంది. జగన్ బుధవారం రాత్రికి నడిపల్లిలోనే బస చేస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి.

Author: admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *