
Jagan not interested on Ambati Rambabu
గుంటూరు జిల్లాలో కాపు నాయకుల్లో కీలక నేతగా ఎదగాలని అంబటి రాంబాబు చాల ప్రయత్నాలు స్తున్నారు పైగా వైసీపీ లో అధికార ప్రతినిదిని తానె అని ఫీల్ అవుతాడు. కొన్ని సందర్భాలలో అంబటి ఏమి మాట్లాడుతున్నాడో ఎందుకు మాట్లాడుతున్నాడో ఎవరికీ అర్ధం కాదు అలాంటి అంబటి కి జగన్ షాక్ ఇచ్చారు. ఇప్పుడు జగన్ వాలకం చుస్తే అంబటి పని అయిపోయినట్టే అనిపిస్తుంది. ఒకపక్క అంబటి కూడా అదే భయం పట్టుకుంది.
ప్రస్తుతం జగన్ ప్రజాసంకల్ప యాత్ర పేరుతొ పాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ పాదయాత్రలో భాగంగా పార్టీ తరపున తన పేరును ప్రకటిస్తే తన మైలేజ్ పెరుగుతుందని అంబటి భావించాడు. కాని ఇక్కడ సీన్ రివర్స్ అయింది. జగన్ ఆయన పేరును ప్రకటించలేదు. ఇక దీంతో తనకు పార్టీ తరపున టికెట్ వస్తుందా రాదా అనే ఆలోచన లో పడ్డాడు అంబటి. ఇటు తెలుగుదేశంలోకి వచ్చే ఛాన్స్ లేదు, పైగా వైసీపీ పార్టీ టికెట్ ఇస్తుందో లేదో తెలియక ఉక్కిరిబిక్కిరి అవుతున్నాడు.
గత ఎన్నికలలో సత్తెనపల్లి నుంచి పోటీ చేసి ఓడిపోయారు అంబటి రాంబాబు. టీడీపీకి కంచుకోట అయిన గుంటూరు జిల్లాలో వైసీపీ పాగా వెయ్యాలని భావిస్తుంది. పీకే సర్వే రిపోర్ట్ ను బట్టి గెలుపు గుర్రాలకే టికెట్లు ఇవ్వాలని, అందుకే టికెట్లు ఇచ్చే విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాడు జగన్. అందుకే ఈసారి అంబటి రాంబాబుకు టికెట్ ఇవ్వకూడదు అనే ఆలోచనలో పడ్డారు జగన్. అక్కడి స్థానిక ఎమ్మెల్యే స్పీకర్ కోడెల చాల శివప్రసాద్ స్ట్రాంగ్ గా ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ అంబటిని నిలబెడితే కోడెలను తట్టుకోవడం కష్టం. అందుకే కోడెల కి పోటీగా ఎర్రం వెంకటేశ్వర రెడ్డికి టికెట్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది.
ఇక అంబటి సత్తెనపల్లి నుండి కాకా వేరే నియోజకవర్గం నుంచి పోటీచేస్త్ దాదాపుగా ఓడిపోవడం ఖాయం. అందుకే సత్తెనపల్లి టికెట్ నే అంబటి ఎక్కువగా కోరుకుంటున్నారు. ఇప్పటికే చాల గ్రౌండ్ వర్క్ చేసుకున్న వైసీపీ నాయకులూ పీకే సర్వే రిపోర్ట్ వల్ల సీటు వస్తుందోలేదో తెలియక నానా ఇబ్బందులు పడుతున్నారు. జగన్ అంబటి టికెట్ ఇవ్వకపోతే వేరే పార్టీలోకి జంప్ అవ్వడం ఖాయం. ఒకవేళ అంబటి పార్టీ నుండి వెళ్లిన జగన్ ఆయనను పట్టించుకునే పరిస్థితులలో లేరు. జగన్ ఇలాంటి వాళ్ళని ఎంతమందిని చూసుంటారో అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.