జగన్‌కు ఓటేస్తే సంక నాకిపోతారు…జెసి దివాకర్ రెడ్డి…

If Jagan gets to vote, he will be destroyed the sate and people

అనంతపురం ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి జగన్ పై మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో జగన్‌కు ఓటేస్తే సంక నాకిపోయినట్టేనని అయన అన్నారు. తరువాత అయన రైతులగురించి మాట్లాడారు. తానూ రైతు బిడ్డనేనని, తనకూ రైతు కష్టాలు తెలుసునని చెప్పారు. చెమటోడ్చి కష్టపడడానికి రైతు సిద్ధంగా ఉన్నా.. నీరు లేక నీరసించిపోతున్నారన్నారు. కొడుకు ఉద్యోగమో, మరొకటో చేసినా సాగునీటి ముందు అవేమీ సాటిరావన్నారు.

If Jagan gets to vote, he will be destroyed the sate and people

చంద్రబాబు సపోర్ట్ తో ఉరవకొండ నియోజకవర్గానికి సాగునీరు తీసుకువచ్చిన ఓపికైన మనిషి పయ్యావుల కేశవ్‌ను వచ్చే ఎన్నికల్లో మంచి మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రజలంతా బాగుండాలని నాయకులెవరైనా కోరుకోవాలన్నారు. అలా కాకుండా వైసీపీ అధినేత జగన్‌ కామన్‌సెన్స్‌ కోల్పోయి అప్పట్లో పట్టిసీమ వద్దన్నారని ఎద్దేవా చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో ముందుచూపున్న నాయకుడు చంద్రబాబేనన్నారు.

తలెత్తుకునేలా ఆంధ్రప్రదేశ్‌ సచివాలయం

రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేది చంద్రబాబు నాయుడు అని అయన అన్నారు. విజన్‌, పట్టుదల, ఏదైనా చేయాలనే తపన ఉన్న నాయకుడు ఆయనేనన్నారు. నదుల అనుసంధానం చేసిన ఏకైక నాయకుడు చంద్రబాబేనన్నారు. మాజీ రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి కలలు కన్న భైరవానితిప్ప ప్రాజెక్టు (బీటీపీ)కు నీరు తేవడం వీళ్లకే సాధ్యమయిందని మంత్రి కాలవ, ఎమ్మెల్యే హనుమంతరాయచౌదరిని ఉద్దేశించి పేర్కొన్నారు. తిరిగి చంద్రబాబు ముఖ్యమంత్రి కాకపోతే అనంతపురం చెరువులకు నీరొచ్చే ప్రసక్తే లేదన్నారు. అందుకే ఆయనను మరోసారి సీఎంగా ఎన్నుకోవాలని కోరారు.

Author: admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *