
వెండితెరపై హీరోయిన్లతో హీరోలు చేసే రొమాన్స్ ఒక్కోసారి వారి రియల్ లైఫ్ లో సమస్యలను తీసుకొస్తుంటాయి. ఇలాంటి ఓ సమస్యతోనే బాలీవుడ్ హీరో ఆయుష్మాన్ ఖురానా మూడేళ్ల పాటు ఇబ్బంది పడ్డాడట.
కొన్నేళ్ల క్రితం బాలీవుడ్ లో సక్సెస్ అయిన ‘విక్కీ డోనర్’ సినిమాలో హీరోగా నటించాడు ఆయుష్మాన్ ఖురానా. ఆ సినిమా తన జీవితాన్ని ఎలా ప్రభావితం చేసిందనే విషయాన్ని వెల్లడించాడు. ”విక్కీ డోనర్ సినిమాలో యామీ గౌతమ్ నా పక్కన హీరోయిన్ గా నటించింది. ఓ సీన్ లో ఆమెతో లిప్ లాక్ చేయాల్సి వచ్చింది.
ఆ సీన్ తెరపై అధ్బుతంగా కనిపించింది. కానీ నా భార్య మాత్రం ఆ సీన్ చూసి చాలా బాధ పడింది. నన్ను వదిలేసి వెళ్ళిపోయింది. మా వైవాహిక జీవితం సెట్ అవ్వడానికి చాలా సమయం పట్టింది. యామీతో లిప్ లాక్ కారణంగా మూడేళ్ల పాటు ఇబ్బందులను ఎదుర్కొన్నాను. ఇప్పుడు నా భార్యకి ముద్దు సీన్లపై అభ్యంతరం ఏమీ లేదు” అంటూ చెప్పుకొచ్చాడు.
ఆయుష్మాన్ ఖురానా నటించిన ‘బాదాయి హో’ , ‘అందాదూన్’ సినిమాలు బాక్సాఫీస్ వద్ద సక్సెస్ ఫుల్ టాక్ తో దూసుకుపోతున్నాయి.
Ayushmann Khurrana reveals how kiss with Yami Gautam in Vicky Donor led to trouble in his marriage for three years | bollywood