ఏపీలో ఇష్టమైన రాజకీయ నాయకుడు ఆయనే

తెలుగులో ‘అభిమన్యుడు’ సక్సెస్ తో హీరో విశాల్ తెగ ఖుషీగా ఉన్నాడు.తెలుగులో విడుదలైన తన గత చిత్రాల కంటే బిన్నంగా ఈ చిత్రం భారీ వసూళ్లు సాధించడం పట్ల సంతోషం వ్యక్తం చేశాడు. దాదాపు 12 కోట్ల వసూళ్లతో ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది. దీంతో సక్సెస్ మీట్ జరిపారు ‘అభిమన్యుడు’ టీమ్ ఈ సందర్బంగా విశాల్ తన మంచి మనసును చాటుకున్నాడు. సినిమా లాభాల్లో కొంతభాగం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ పేద రైతులకు ఇవ్వాలని సూచించాడు. అంతేకాకుండా వీలైతే సినిమా టికెట్ పై ఒక్కరూపాయి రైతులకు వెచ్చిస్తానని చెప్పారు.

Image result for ysjagan hero vishal
ఇక ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు విశాల్ స్పందిచారు.. తనకు ఏపీ రాజకీయాల గురించి అవగాహన ఉందని.. ప్రస్తతం వైసీపీ అధినేత వైయస్ జగన్ చేస్తున్న పాదయాత్ర మామూలు విషయం కాదని.. ప్రజల్లో తిరగడానికి చాలా ఓపిక ఉండాలని.. అయన ప్రయత్నం వృధా కాదని అన్నారు. అంతేకాకుండా తనకు మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం, స్వాతంత్ర సమరయోధుడు భగత్ సింగ్ అన్నా చాలా ఇష్టమని అలాగే జగన్ కూడా చాలా ఇష్టమని వెల్లడించారు.

Author: admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *