చిరంజీవితో అందుకే సినిమా చేయలేదు!: గౌతమి

తెలుగు .. తమిళ భాషల్లో నిన్నటితరం కథానాయికగా పేరు తెచ్చుకున్న వారిలో గౌతమి ఒకరు. నాజూకైన కథానాయిక అనిపించుకున్న ఆమె, అప్పట్లో చిరంజీవితో మాత్రం నటించలేదు. అందుకు గల కారణం ఏమిటనే ప్రశ్న గౌతమికి ఐ డ్రీమ్స్ నుంచి ఎదురైంది.

అందుకు ఆమె స్పందిస్తూ ..”చిరంజీవితో చేయమంటూ ఓ మూడు సినిమాల నుంచి అవకాశాలు వచ్చాయి. ప్రతిసారి డేట్స్ సమస్య తలెత్తుతూ వచ్చింది. ఒక సినిమా కమిటైన తరువాత .. ఆ తరువాత పెద్ద ప్రాజెక్టు నుంచి ఆఫర్ వచ్చినా ముందుగా ఇచ్చిన కమిట్ మెంట్ కే కట్టుబడి వుంటాను. అందువలన చిరంజీవి గారితో కలిసి నటించలేకపోయానే గానీ మరే కారణమూ లేదు. ఇక మంచి అవకాశాలను వదులుకోవలసి వచ్చినప్పుడు అందరిలానే నాకూ బాధగా ఉంటుంది” అని చెప్పుకొచ్చారు.

Author: admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *