వీడియో చూసి.. గుండెలు అదిరాయ్ : బిల్డింగ్ పైనుంచి దూకి యువతి ఆత్మహత్య

హైదరాబాద్ అబిడ్స్ లో విషాదం చోటు చేసుంది. మయూరి బిల్డింగ్ పై నుంచి దూకి కాచిగూడకు చెందిన జెస్లీస్ కౌర్ ఆత్మహత్య చేసుకుంది. నీట్ పరీక్షలో తక్కువ మార్కులు రావడంతోనే ఈ అఘాయిత్యం చేసుకున్నట్లు చెబుతున్నారు బంధువులు. జూన్ 5వ తేదీ మంగళవారం ఉదయం తొమ్మిదిన్నర గంటల సమయంలో మయూరి బిల్డింగ్ లోకి కౌర్ వెళ్లినట్లుగా సీసీ కెమెరాల్లో రికార్డైంది. నేరుగా 9వ అంతస్తుపైకి వెళ్లింది. అక్కడ్నుంచి కిందకు దూకింది.
బిల్డింగ్ పైనుంచి దూకుతున్నప్పుడు చుట్టుపక్కల వారు, కింద ఉన్న వారు కేకలు వేశారు. దూకొద్దు అని అరిచారు. దూకితే ఎలా రక్షించాలని కొందరు ఆలోచన చేస్తున్నారు.. మరికొందరు పోలీసులకు ఫోన్ చేశారు.. మరికొందరు కాపాడేందుకు బిల్డింగ్ పైకి పరిగెత్తారు.. మరికొందరు దుప్పటాలు, కవర్లు తెచ్చి కింద పడకుండా కాపాడాలని ప్రయత్నాలు చేస్తున్నారు.. అందరూ ఎవరికి వారు కాపాడాలనే ఆలోచనలో ఉండగానే జరగరాని ఘోరం జరిగిపోయింది. బిల్డింగ్ చివరి అంచు వరకు వచ్చిన కౌర్.. నిమిషం కూడా ఆలస్యం కాకుండా వెంటనే దూకేసింది. తొమ్మిది అంతస్తుల బిల్డింగ్ పైనుంచి కింద పడటంతో స్పాట్ లోనే చనిపోయింది.

కళ్ల ఎదుట.. ఓ యువతి బిల్డింగ్ పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకోవటాన్ని కొందరు వీడియోలో చిత్రీకించారు. ఇది ఇప్పుడు సోషల్ మీడియాల వైరల్ అయ్యింది. ప్రత్యక్షంగా చూసిన వారి గుండెలు అదిరాయ్. మరికొందరు వణికిపోయారు. తొమ్మిది అంతస్తుల నుంచి కిందకి చూస్తేనే కళ్లు తిరుగుతాయి.. అలాంటిది ఓ యువతి దూకటం చూసి అక్కడ ఉన్న వారి గుండెలు వేగంగా కొట్టుకున్నాయి.

Author: admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *