వీడియో చూస్తూ చాటింగ్ చేసుకోవచ్చు..!

న్యూఢిల్లీ/హైదరాబాద్: కొరియాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ సామ్‌సంగ్..ఇతర సంస్థల నుంచి ఎదురవుతున్న పోటీని తట్టుకోవడానికి మార్కెట్లోకి ఒకేసారి నాలుగు మోడళ్లను ప్రవేశపెట్టింది. గెలాక్సీ సిరీస్‌లో భాగంగా విడుదల చేసిన ఈ ఫోన్లు రూ.13,990 నుంచి రూ.25,990 మధ్యలో లభించనున్నాయి. జే6, ఏ6, ఏ6ప్లస్‌లు మంగళవారం నుంచి అందుబాటులోకి రానుండగా, జే8 మాత్రం జూన్ చివరి వారం నుంచి లభించనున్నదని కంపెనీ వర్గాలు వెల్లడించాయి.5.6, 6 అంగుళాల టచ్‌స్క్రీన్లతో రూపొందించిన ఈ ఫోన్లలో ఆండ్రాయిడ్ ఓరియో 8.0 ఆపరేటింగ్ సిస్టమ్, 3జీబీ ర్యామ్-32జీబీ మెమొరీ, 4జీబీ ర్యామ్-64 జీబీ మెమొరీ, ఆక్టా-కోర్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 450 ప్రాసెసర్, 16 మెగాపిక్సెల్ వరకు కెమెరాలు, 3500 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ఫీచర్స్ ఉన్నాయి. వీడియో చూస్తున్నప్పుడు చాటింగ్ చేసుకునే సౌలభ్యం కూడా ఈ ఫోన్లలో ఉన్నదని కంపెనీ డైరెక్టర్ సుమిత్ వాలియా ఈ సందర్భంగా తెలిపారు. జే8ని పేటీఎం మాల్ ద్వారా కొనుగోలు చేసినవారికి రూ.1,500 క్యాష్‌బాక్ ఆఫర్ లభించనున్నది.

Author: admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *