ఫేస్‌బుక్ వ్యసనం దంపతుల ప్రాణాలు తీసింది

ఫేస్‌బుక్ వ్యసనం దంపతుల ప్రాణాలు తీసింది. భార్య ఫేస్‌బుక్ ఛాటింగ్ చేస్తుందనే విషయంపై భర్తతో ఏర్పడిన కొట్లాట ఇద్దరి ఆత్మహత్యకు దారితీసిన విషాద ఘటన కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరులో వెలుగుచూసింది. బెంగళూరు నగరంలోని రామయ్య లేఅవుట్ లో నివాసముంటున్న అనూప్, సౌమ్యలు భార్యాభర్తలు. అనూప్ ఫౌల్ట్రీఫీడ్ కంపెనీలో డిప్యూటీ మేనేజరుగా పనిచేసేవాడు. భార్య సౌమ్య గృహిణి.

Image result for facebook effect on society

వారికి రెండేళ్ల బాబు ఉన్నాడు. భార్య సౌమ్య నిత్యం ఫేస్‌బుక్ ఛాటింగులతో సమయం గడుపుతుందని భర్త అనూప్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఫేస్‌బుక్ ఛాటింగ్ విషయంలో భార్యతో భర్త అనూప్ తరచూ గొడవపడేవాడు. బావమరిది అయిన రవిచంద్రను పిలిచి ఆమెతో భార్యను పుట్టింటికి పంపించాలని అనూప్ నిర్ణయించుకున్నాడు. చెల్లెలిని తీసుకువెళ్లేందుకు రవిచంద్ర బావ అనూప్ ఇంటికి వచ్చాడు.

Related image

తలుపులు వేసి ఉండటంతో పగులగొట్టి చూడగా రెండు వేర్వేరు గదుల్లో అనూప్, సౌమ్యలు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకొని కనిపించారు. రెండేళ్ల చిన్నారి బాలుడు మాత్రం హాలులో ఉన్నాడు. భార్యాభర్తలు ఫేస్‌బుక్ విషయంలో గొడవపడి ఇద్దరూ ఆత్మహత్య చేసుకున్నారని ఇరుగుపొరుగువారు చెప్పారు. పోలీసులు దంపతుల మృతదేహాలను పోస్టుమార్టం కోసం తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Author: admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *