
F1H2O World Championship
కృష్ణా జలాలపై గంటకు 220 కిమీ వేగంతో దూసుకుపోతూ, ఒళ్లు గగుర్పొడిచేలా ఒకదానితో ఒకటి పోటీపడుతూ… వీక్షకులను ఉత్కంఠ పరిచేలా పవర్ బోట్లు విన్యాసాలు చేయనున్నాయి. విజయవాడ ప్రకాశం బ్యారేజీ వద్ద కృష్ణా నదిలో శుక్రవారం నుంచి ఫార్ములా-1 (ఎఫ్1హెచ్2ఓ) పవర్ బోట్ ప్రపంచ ఛాంపియన్షిప్ పోటీలు ప్రారంభం కానున్నాయి.
ఆస్ట్రేలియా, చైనా, ఫిన్లాండ్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, భారత్, పోలాండ్, పోర్చుగల్, స్వీడన్, థాయ్‌లాండ్, యూఏఈ, యూఎస్ఏ, నార్వే దేశాలకు ప్రాతినిధ్యం వహిస్తూ 19 మంది బోట్ డ్రైవర్లు ఈ పోటీల్లో పాల్గొంటున్నారు. వీళ్ళు విక్టరీ, టీమ్ అబుదాబీ, సీటీఐసీఎఫ్1 షెన్జెన్ చైనా, ఎఫ్1 అట్లాంటిక్ టీం, మ్యాడ్ క్రాక్ బాబా రేసింగ్, టీం అమరావతి, బ్లేజ్ ఫర్ఫార్మెన్స్, ఎమిరేట్స్ రేసింగ్ టీం, మావ్రిక్ టీం… అనే 9 టీములుగా పాల్గొంటున్నారు. రాజధాని అమరావతి బోట్ ప్రధాన డ్రైవర్‌గా స్వీడన్‌కు చెందిన రేసర్ 45 ఏళ్ల జోనస్ అండర్సన్ పాల్గొంటున్నారు. 16వ తేదీ..శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పోటీలను ప్రారంభిస్తారు.
పవర్ బోట్ రేస్ సమయంలో వచ్చేవారికి ఆహ్లాదాన్ని పంచేలా 16నుంచి 18వరకూ విశ్వ సంగీత- నృత్య ఉత్సవం, ఆంధ్రా రుచులను పంచుతూ ఆహోరోత్సవం, శాఖలవారీగా ప్రత్యేకతలను చాటే అంశాలతో కూడిన స్టాళ్ల సందడి ఉంటుంది. దుర్గాఘాట్, బరంపార్క్, ప్రకాశం బ్యారేజీ ప్రాంతాల్లో దాదాపు లక్ష మంది కూర్చుని పోటీలు చూసేలా ఏర్పాట్లు చేశారు.
ఎఫ్1హెచ్2ఓ ప్రపంచ ఛాంపియన్షిప్ పోటీలకు 60 దేశాల్లో 9 కోట్ల మంది ప్రేక్షకాదరణ ఉంది. ఈ పోటీల్లో టీం అమరావతి బోట్ ఉండడం వల్ల అమరావతికి ఆ దేశాలన్నింటిలో అంతర్జాతీయ బ్రాండింగ్ లభిస్తుంది.
Tiny Boats parade the streets of Vijayawada a day before the inaugural of F1H2O World Championship. #F1H2O_amaravati #F1H2O