మహేష్ కథతో సుకుమార్ డైరెక్షన్ లో విజయ్ దేవరకొండ….

సుకుమార్ దర్శకత్యంలో వచ్చిన ‘రంగస్థలం’ చిత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ సాధించడంతో పాటు భారి వసూళ్లు సాధించింది. ఆ చిత్రం తరువాత సుకుమార్ మహేష్ బాబు కాంబినేషన్ లో మరో మూవీ అంటూ చాల వార్తలు వచ్చాయి. అయితే సుకుమార్ ఆ కథను ఇటీవ‌ల మహేష్ బాబుకు కూడా వినిపించాడట. అయితే ఈ క‌థ మొత్తం తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో ఉండ‌టంతో వేరే క‌థ రాయ‌మ‌ని కోరాడు మ‌హేష్..

ఇప్పటికే మహేష్ మహర్షి మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. మళ్ళి వేరే కథ రాసి అది సెట్స్ మీదకి వెళ్లాలంటే చాల సమయం పడుతుందని అనుకున్నాడు సుకుమార్. ఈ లోగ అదే క‌థ‌తో విజయ్ దేవరకొండతో చేస్తే బాగుంటుందనే ఆలోచన సుకుమార్ వచ్చిన‌ట్లు టాక్..

తెలంగాణ నేపథ్యంలో సాగే కథ కావడం తో, ఈ కథకి విజయ్ దేవరకొండ సరిగ్గా సరిపోతాడని సుకుమార్ భావించాడని అంటున్నారు ఫిలింనగర్ వాసులు. ఈ కథతో ఆయన విజయ్ దేవరకొండను సంప్రదించడం కూడా జరిగిపోయిందని చెబుతున్నారు.. త్వ‌ర‌లోనే అధికారికంగా ఈ మూవీ వివ‌రాలు ప్ర‌క‌టించ‌నున్నట్లు టాక్ వినిపిస్తుంది.

Author: admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *