మ‌ళ్లీ త‌ల్లి అయిన చిరంజీవి కూతురు…మ‌రి శుభావార్త ఎప్పుడో?

మెగాస్టార్ చిరంజీవి మ‌ళ్లీ తాత‌య్య కాబోతున్నారు.చిరంజీవి రెండో కూతురు శ్రీజ రెండోసారి త‌ల్లైంది.త‌ను గర్భవతిన‌ని హింట్ ఇస్తు ఓ ఫోటోని సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసింది.ఇదే విషయాన్ని తన భర్త కళ్యాణ్ సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ‘శ్రీజ కల్యాణ్ బేబి2 #లోడింగ్’ అంటూ అతడు పెట్టిన పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది.

Image result for sreeja chiranjeevi

చిరంజీవి కూతురు శ్రీజకు ఇది రెండో పెళ్లి.గ‌తంలో ఆమె ఓ వ్య‌క్తి ప్రేమించి పెళ్లి చేసుకుంది.ఇంట్లో నుంచి వెళ్లి మ‌రి పెళ్లి చేసుకున్న శ్రీజ‌,అప్ప‌ట్లో చిరంజీవి,ప‌వ‌న్‌లపై షాకింగ్ కామెంట్స్ చేసింది.

Related image

బాబాయ్ ప‌వ‌న్ నుంచి త‌న‌కు ప్రాణ హాని ఉంద‌ని చెప్పి సంచ‌ల‌నానికి తెర లేపింది. మొద‌టి భ‌ర్త‌కు శ్రీజ‌కు ఓ కుమార్తె ఉంది. త‌రువాత వీరి మ‌ధ్య విభేదాలు రావ‌డంతో అత‌నికి విడాకులు ఇచ్చింది శ్రీజ‌.మొదటి భర్తతో విడిపోయిన తరువాత కళ్యాణ్ కనుగంటి అనే వ్యక్తిని శ్రీజ రెండో వివాహం చేసుకుంది. బెంగుళూరులోని చిరంజీవి ఫామ్ హౌస్ లో వీరి వివాహం అట్టహాసంగా జరిగింది.

Image result for sreeja chiranjeevi

ఇప్పుడు ఈ జంటకి ఓ బిడ్డ పుట్టనుండడంతో మెగాఫ్యామిలీ సంబరాలు చేసుకుంటోంది. కాని ఎప్పుడు నుంచో ఎదురు చూస్తున్న రామ్ చ‌ర‌ణ్‌- ఉపాస‌నల జంట మాత్రం గూడ్ న్యూస్ చెప్ప‌డం లేదు.

Author: admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *