విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నా క్రిష్

టాలీవుడ్ లో మరో సంచలనం. అద్భుత చిత్రాల దర్శకుడు క్రిష్ కుటుంబంలో విభేదాలు చర్చనీయాంశం అయ్యాయి. భార్య నుంచి విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. క్రిష్ – రమ్య పరస్పర అంగీకారంతో.. ఇద్దరూ అనుకుని విడిపోవాలని నిర్ణయించుకున్నట్లు సినీ ఇండస్ట్రీ అంటోంది. కలిసి ఉండలేం అనుకున్నప్పుడు.. కలిసి విడిపోవటం మంచిదని..

Image result for director krish with wifeఅభిప్రాయాలు కలవనప్పుడు విడిపోవటమే బెటర్ అని ఇద్దరూ నిర్ణయించుకున్నారు. ఈ మేరకు విడాకుల కోసం ఫ్యామిలీ కోర్టులో దరఖాస్తు చేసుకున్నట్లు తెలుస్తోంది. రెండు రోజులుగా ఈ వార్త సోషల్ మీడియాలో ప్రచారంలోకి రావటంతోపాటు.. ఫిల్మ్ ఇండస్ట్రీలోనూ గుసగుసలు ఎక్కువ అయ్యాయి. చాలా మంది ప్రముకులు కూడా క్రిష్ ను ఇదే అంశంపై ఫోన్ చేసి ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో డైరెక్టర్ క్రిష్ స్వయంగా ఈ విషయాన్ని ప్రకటించి.. ప్రచారానికి తెరదించాలని డిసైడ్ అయ్యారు.

Related image
బాలయ్య గౌతమిపుత్ర శాతకర్ణి మూవీ సమయంలోనే డాక్టర్ రమ్యను వివాహం చేసుకున్నారు క్రిష్. ఈ వెంటనే సినిమా షూటింగ్ బిజీలో పడ్డారు. ఆ మూవీ హిట్ తర్వాత.. హిందీలో కంగనారనౌత్ తో మణికర్ణిక ప్రాజెక్ట్ చేపట్టాడు. ఆరు నెలలుగా అదే పనిలో బిజీగా ఉన్నాడు. ఇప్పుడు ఎన్టీఆర్ బయోపిక్ దర్శకత్వ బాధ్యతలు కూడా చేపట్టాడు. కుటుంబంతో కంటే.. సినిమాల్లోనే బిజీ అయిపోవటంతో భార్య రమ్యతో బేధాభిప్రాయాలు వచ్చినట్లు సమాచారం. Related imageఈ క్రమంలోనే ఇద్దరూ చర్చించుకుని ఓ నిర్ణయానికి వచ్చి.. విడిపోవాలని అనుకున్నారంట. ఆ క్రమంలోనే విడాకులకు కూడా అప్లయ్ చేసినట్లు తెలుస్తోంది.
ఇక క్రిష్‌ విడాకుల విషయంపై ఇంకా క్లారిటీ అయితే రాలేదు, కాని ఈ విడాకులకు కారణం హీరోయిన్‌ ప్రగ్యా జైస్వాల్‌ అంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి. కంచె చిత్రంతో ప్రగ్యాను క్రిష్‌ పరిచయం చేశాడు. ఆ సన్నిహిత్యంతోనే క్రిష్‌తో ప్రగ్యా క్లోజ్‌గా మెలుగుతూ వస్తుంది. ఇద్దరి మద్య సన్నిహిత్యం పెరిగిందని, అది కాస్త శారీరక సంబంధంకు కూడా దారి తీసిందనే పుకార్లు సోష‌ల్ మీడియాలో షికార్లు చేస్తున్నాయి. అందుకే రమ్య విడాకులకు సిద్దమైంద‌ని తెలుస్తోంది. మ‌రి ఈ విషయం పై క్రిష్ క్లారిటీ ఇస్తే కానీ ఒక నిర్ణ‌యానికి రాలేమని స‌ర్వ‌త్రా చ‌ర్చించుకుంటున్నారు.

Author: admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *