విజయవాడ లో అభ్యంతరకర నృత్యాలు

విజయవాడ: భవానీపురంలో కిట్టీ పార్టీల పేరిట అభ్యంతరకర నృత్యాలు చేస్తున్న వారిని పోలీసులు గురువారం అదుపులోనికి తీసుకున్నారు. భవానీపురం బ్యాంకు సెంటర్‌ వద్ద ఉన్న ఓ హోటల్‌లో రేవ్‌ పార్టీ నిర్వహిస్తున్నట్లు వచ్చిన సమాచారంతో బుధవారం రాత్రి పోలీసులు ఆకస్మిక తనిఖీ చేశారు. ఐదుగురు మహిళలతో కలిసి 53 మంది పురుషులు అభ్యంతరకర నృత్యాలు చేస్తున్నట్లు గుర్తించారు. విజయవాడతో పాటు భీమవరం, హైదరాబాద్‌ నుంచి మహిళలను ఇక్కడకు తీసుకొచ్చినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది. వీరిలో ఎనిమిది మందికి వ్యక్తిగత పూచీకత్తుపై పోలీసులు బెయిల్‌ మంజూరు చేశారు. మహిళలను వాసవీ మహిళ మండలికి, పురుషులను భవానీపురం, ఇబ్రహీంపట్నం, గవర్నర్‌పేట పోలీసు స్టేషన్‌లకు తరలించారు.

Author: admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *