
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సీపీఎస్ విధానాన్ని వెంటనే రద్దుచేయాలంటు కృష్ణా విశ్వవిద్యాలయానికి చెందిన పలువురు ఆచార్యులు డిమాండ్ చేశారు. సీపీఎస్‌ను రద్దు చేయాలని కోరుతూ పట్టణ పరిధిలోని విశ్వవిద్యాలయం ప్రధాన ప్రాంగణం ఎదుట వర్సిటీ సిబ్బంది నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ వేలాది మంది ఉద్యోగులకు నష్టం కలిగించే సీపీఎస్ విధానాన్ని కొనసాగించడం ఎంతమాత్రం సబబు కాదన్నారు. దీనిపై అనేకమంది నుంచి తీవ్రస్థాయిలో వ్యతిరేకత వ్యక్తమవుతున్నప్పటికీ ప్రభుత్వం స్పందించకపోవడం సరికాదన్నారు.