ఆ హీరోయిన్ కోసం తెలంగాణాలో బాలయ్య ప్రచారం…

congress leader vijayashanti may contest from kukatpally

సినీ నటి, కాంగ్రెస్ నేత విజయశాంతి ఈసారి జరగబోయే ఎన్నికల్లో పోటీ చేయబోనని, ప్రచార రథసారథిగానే వ్యవహరిస్తానని చెప్పిన సంగతి తెలిసిందే. అయితే, కాంగ్రెస్ అధిష్టానం రాములమ్మను వచ్చే ఎన్నికల్లో పోటీకి దించాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా విజయశాంతి దుబ్బాక నుంచి పోటీ చేస్తారని ఇటీవల వార్తలు వచ్చాయి కూడా.

తాజాగా కాంగ్రెస్ అధిష్టానం కూకట్ పల్లి నుంచి పోటీకి దించాలని అనుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే కూకట్ పల్లి సీటును వాస్తవానికి తెలుగుదేశం పార్టీ ఆశించింది. టీడీపి నేత పెద్దిరెడ్డి ఈ సీటు నుంచి పోటీ చేయడానికి ఆసక్తి ప్రదర్శించారు. కానీ పార్టీ నాయకత్వం ఆయనను పోటీకి దూరంగా ఉంచాలని చూసించింది. తరువాత ఆయనకు ఎమ్మెల్సీ సీటు ఇస్తామని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో ఆయన పోటీ చేయాలనే ఆలోచనను విరమించుకున్నట్లు తెలుస్తోంది.

కూకట్ పల్లిలో ఆంధ్ర ఓటర్లు ఎక్కువగా పైగా అక్కడ టీడీపికి విజయం సాధించడం ఖాయం. అయితే, విజయశాంతిని కూకట్ పల్లి నుంచి పోటీకి దించితే త్యాగం చేయడానికి టీడీపి నాయకత్వం సిద్ధపడినట్లు తెలుస్తోంది.

ఒకవేళ విజయశాంతి కూకట్ పల్లి నుంచి పోటీ చేస్తే, ఆమె తరుపున ప్రచారం చేయడానికి సినీ హీరో, ఆంధ్రప్రదేశ్ టీడీపి ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కూడా దింపాలని భావిస్తుంది. బాలకృష్ణ, విజయశాంతి కలిసి చాల సినిమాల్లో నటించారు. బాలకృష్ణ ప్రచారానికి వస్తే విజయశాంతి విజయం మరింత సులభమవుతుందని అధిష్టానం అభిప్రాయం.

Author: admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *