
ఐకియా స్టోర్ పై సామాన్యుడి శ్వేత పత్రం…
ఈ స్టోర్ స్వీడన్ దేశ సంస్థ. ప్రపంచం నలుమూలల శాక లున్నాయి. మన దేశం లో హైదరాబాద్ లోని స్టోర్ మొదటిది.
1 . ఇంటీరియర్ డెకరేషన్
— ఇవి కొత్త గ ఇల్లు కొనుక్కున్న/ కట్టుకొన్న వారికి లేక రీమోడల్ చేసుకొనే వారికి మాత్రమే ఉపయోగం. ధరలు లు కొంచెం ప్రియం.
2 . కిచెన్ వెర్
— అన్ని రకాలైన వస్తువు లభిస్తాయి..చివరికి ఫ్రూట్ జ్యూస్ తీసేవి కూడా. ధరలు పర్వా లేదు.
3. టెక్స్టైల్స్
— తక్కువ మోడల్స్, కానీ బాగున్నాయి. ధరలు పర్వా లేదు.
4 . ఫర్నిచర్ ఐటమ్స్.
— చాల వరకు మోడ్యులర్. క్వాలిటీ పర్వా లేదు. ధరలు లు కొంచెం ప్రియం.
5. ఎక్సటిరియర్ డెకరేషన్
— తక్కువ మోడల్స్, కానీ బాగున్నాయి. ధరలు పర్వా లేదు.
6 .రెస్టారెంట్, కెఫెటేరియా ధరలు ప్రస్తుతానికి జేబుకి చిల్లు పెట్టడం లేదు .
7. పార్కింగ్ లాట్ చాల పెద్దది. ఫ్రీ పార్కింగ్ ప్రస్తుతానికి .
8. స్టాఫ్ ప్రస్తుతానికి అందుబాటులోనే ఉండి కావలసిన సమాచారాన్ని ఇస్తున్నారు.
9. ఫామిలీ కార్డు , బిజినెస్ కార్డు అని వున్నాయి. మీరు స్టోర్ లోకి వెళ్లి నప్పుడు స్టాఫ్ ని అడిగితే కార్డు రావటానికి సాయం చేస్తారు. 5 నిమిషాలలో కార్డు చేతి కి వస్తుంది. బిజినెస్ కార్డు కి ౩౦ రోజులు పడుతుంది. ఈ కార్డు ల వల్ల కొన్ని వస్తువుల పై డిస్కౌంట్ వస్తుంది.
10. ప్రస్తుతానికి ఎంట్రీ ఫ్రీ.
11. ఉప్పులూ, పప్పులు లాంటివి, ఎలక్ట్రానిక్ / ఎలక్ట్రికల్ గూడ్స్ , ఫుట్ వెర్ , గ్రూమింగ్ ఐటమ్స్..ఏమి..ఏమి లేవు. పైన పేర్కొన్న ఐదు మాత్రమే లభ్యం. మెట్రో కాష్ అండ్ క్యారీ స్టోర్ ల ఉంటే బాగుండేది అని జనాల్లో వినిపిస్తోంది.
12. పెద్ద పెద్ద ఎలివేటర్లు, మూవింగ్ స్తైర్ కేసు లు వున్నాయి.
13. సెల్ఫ్ చెక్ ఇన్ మరియు సెల్ఫ్ చెక్ అవుట్ …అనగా మన బిల్ మనమే వేసుకొని, పే చేసి సామాను తీసుకొని బయటకు వస్తాము. బిల్ కౌంటర్ లో వ్యక్తి చేసే పని మనమే చేసుకుని రావచ్చు. టైం ఆదా..
ప్రత్యక్షం గ / పరోక్షం గ సుమారు పదిహేను వేల మందికి ఉపాధి / ఉద్యోగ అవకాశాల్ని కల్పిస్తోంది. ఇటువంటి సంస్థలు మన రాష్ట్రము లో కూడా అవసరం.