
అమరావతి: 12.26 లక్షల మందికి నెలకు వెయ్యి రూపాయల చొప్పున నిరుద్యోగ భృతి కల్పిస్తూ ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం తీసుకున్న నిర్ణయంపై యువతరం నుంచి హర్షం వ్యక్తమౌతోంది. యువత పెద్దఎత్తున ఉండవల్లిలోని సీఎం చంద్రబాబు నివాసానికి తరలివస్తున్నారు. నిరుద్యోగ భృతి కల్పించినందుకు ముఖ్యమంత్రికి ధన్యవాదాలు చెబుతున్నారు. తాను మాట నిలబెట్టుకున్నానని, నిరుద్యోగులను ఆదుకునేందుకే ఈ పథకానికి శ్రీకారం చుట్టానని ముఖ్యమంత్రి తెలిపారు.
కేబినెట్ నిన్న ‘ముఖ్యమంత్రి -యువనేస్తం’ పథకాన్ని ప్రారంభించింది. ఆగస్టు మూడు లేదా నాలుగో వారంలో నిరుద్యోగులు తమ పేర్లను నమోదు చేసుకోవచ్చు. 22 నుంచి 35 ఏళ్ల మధ్య వయసున్న నిరుద్యోగులు ఆన్లైన్లో తమ పేర్లను, వివరాలను నమోదు చేసుకోవచ్చు.