ఆయనికి 59, ఆమెకు 31.. సీఎం సార్ ప్రేమ, పెళ్లి ఇలా..

దేశ వ్యాప్తంగా కర్ణాటక ఎన్నికలు హాట్ టాపిక్‌గా నడుస్తున్న తరుణంలో మరో ఇంట్రస్టింగ్ టాపిక్‌ను వెతికిపట్టారు నెటిజన్లు. సస్పెన్స్ థ్రిల్లర్‌ను తలిపించిన కర్ణాటక ఎన్నికల్లో ఫైనల్‌గా సీఎం పీఠాన్ని జేడీఎస్ నేత కుమార స్వామి చేజిక్కించుకున్నారు. మే 23న ఆయన సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతుండటంతో నెటిజన్లు గూగుల్‌లో కుమారస్వామి పర్సనల్ ప్రొఫైల్ గురించి వెతకడం ప్రారంభించారు. ఈ వెతుకులాటలో కుమారస్వామి రెండో భార్య రాధిక అనూహ్యంగా తెరపైకి వచ్చారు. ఒకప్పటి హీరోయిన్.. ప్రస్తుతం కర్ణాటక రాష్ట్రానికి కాబోయే సీఎం రెండో భార్య రాధిక కుమార స్వామి గూగుల్ మోస్ట్ ట్రెండింగ్‌లో టాప్ ప్లేస్‌లో ఉన్నారంటే ఆమె కోసం నెటిజన్లు ఏ స్థాయిలో సెర్చ్ చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. అయితే కేవలం భారతదేశంలోనే కాకుండా శ్రీలంక, అమెరికా, ఖతర్, కువైట్ దేశాల్లో సైతం రాధిక కుమార స్వామి టాప్ ట్రెండింగ్‌లో కొనసాగుతున్నారు. గూగుల్ ప్రకటించే టాప్ 100లో 18వ స్థానంలో రాధిక కుమార స్వామి ఉన్నారంటే ఆమె వ్యక్తిగత సమాచారం రాబట్టడం కోసం నెటిజన్స్ ఏ రేంజ్‌లో సెర్చ్ చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు.
kumaraswamy glamorous wife radhika kumaraswamy trending on google

రాధికా కుమార స్వామి
ఎవరీ రాధికా కుమార స్వామి:

రాధికా కుమార స్వామి అసలు పేరు రాధికా కుట్టి. హీరోయిన్‌గా నిర్మాతగా అనేక చిత్రాలకు పనిచేశారు. ఆమె 14 ఏళ్ల వయస్సులోనే హీరోయిన్‌గా కెరియర్ స్టార్ట్ చేశారు. 2002 సంవత్సరంలో ‘నీలి మేఘ శ్యామ’ అనే కన్నడ చిత్రంలో హీరోయిన్‌గా కెరియర్ ప్రారంభించారు. ఆ తరువాత ‘నినరాగి’, ‘తవరిగె బా తంగి’, మనె మగలు, తయి తల్లడ తబ్బాలి, తాయి ఇల్లడ తబ్బాలి చిత్రాల్లో వరుసగా నటించారు. తాయి ఇల్లడ తబ్బాలి చిత్రానికి గానూ కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వంచే ఉత్తమనటిగా పురుస్కారం అందుకుంది. ఇక కోలీవుడ్‌లో ‘ఇయర్ కాయ్’ అనే చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది. ఒక వైపు హీరోయిన్‌గా నటిస్తూనే నిర్మాణ రంగవైపు వెళ్లారు. ‘షమిక ఎంటర్ ప్రైజెస్ పేరుతో ఓ స్టుడియోను స్థాపించారు. అనంతరం ‘లక్కీ’ అనే చిత్రానికి దర్శకత్వ బాధ్యతల్ని కూడా చేపట్టారు.

Image result for radhika kumaraswamy

రాధికా కుమార స్వామి
టాలీవుడ్‌తో అనుబంధం ఇలా..
కన్నడ, తమిళ ఇండస్ట్రీలో సుమారు 30 చిత్రాలకు పైగా నటించిన రాధికా కుమార స్వామి 2004లో నందమూరి హీరో తారకరత్న సరసన ‘భద్రాద్రి రాముడు’ చిత్రంలో కనిపించారు. ఈ మూవీకి సురేష్ క్రిష్ణ దర్శకత్వం వహించారు. అనంతరం 2014లో‘అవతారం’ అనే భక్తిరస చిత్రంలో నటించారు. ఈ చిత్రానికి కోడి రామక్రిష్ట దర్శకుడు.

Image result for radhika kumaraswamy

రాధికా కుమార స్వామి
కుమార స్వామితో అనుబంధం ఇలా..

Image result for radhika kumaraswamy
జేడీఎస్ నేత, కాబోయే కర్ణాటక సీఎం కుమారస్వామి కన్నడ చిత్ర సీమలో నిర్మాతగా పలు చిత్రాలను నిర్మించారు. ఈ నేపథ్యంలోనే హీరోయిన్ రాధికా కుమారస్వామితో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం ప్రేమగా మారడంతో 2006 సంవత్సరంలో ఇరువురు పెళ్లిచేసుకున్నారు. వీరికి షమికా కే స్వామి అనే కూతురు ఉంది. అయితే ఈ ఇద్దరికీ ఇది రెండో వివాహం కావడం విశేషం. రాధిక మొదటి భర్త చిన్న వయసులోనే గుండెపోటుతో మరణించారు. అయితే కుమారస్వామి, రాధిక వివాహంపై మాత్రం ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడకపోవడం గమనార్హం. అయితే 2010లో కాంగ్రెస్ నాయకురాలు రమ్య రాధికకు, కుమారస్వామికి వివాహమైన విషయాన్ని వెలుగులోకి తీసుకువచ్చారు. అనంతరం కుమారస్వామి.. రాధికతో తనకు వివాహమైన విషయాన్ని అంగీకరించారు.

Author: admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *