‘సైరా’ సెట్‌ని కూల్చేశారు

మెగాస్టార్ చిరంజీవి హీరోగా, సురేంద్ర రెడ్డి దర్శకత్వంలో ‘సైరా నరసింహ రెడ్డి’ అనే చారిత్రాత్మక చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెల్సిందే. అయితే ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. ఈ సినిమా నిర్మాత రామ్ చరణ్ నటించిన ‘రంగస్థలం’ సినిమా షూటింగ్ జరిగిన సెట్స్ లోనే ‘సైరా’ షూటింగ్ కూడా జరుగుతోంది.

అయితే శేరిలింగంపల్లి రెవెన్యూ పరిధిలో ఉన్న ఈ సెట్స్ లో రంగస్థలం షూటింగ్ పూర్తయిన తరువాత సైరా సినిమాకు కావాల్సిన సెట్స్‌ను ఏర్పాటు చేశారు. ఇది ప్రభుత్వ భూమి కావడంతో వారి వద్ద పర్మిషన్ తీసుకొని పని మొదలుపెట్టాలి.

కానీ చిత్రబృందం ఆ విధంగా చేయకపోవడంతో ఆగ్రహించిన అధికారులు ఈ విషయం తెలుసుకుని ప్రభుత్వ స్థలంలో సెట్‌ ఏర్పాటుకు అనుమతి లేదని జేసీబీలను తీసుకువచ్చి కూల్చివేశారు. దీంతో షూటింగ్‌కు అంతరాయం ఏర్పడిందట. ఆ స్థలాన్ని ఖాళీ చేయాలని ఎన్నిసార్లు నోటీసులు పంపినా చిత్రబృందం స్పందించకపోవడంతో సెట్స్‌ను నాశనం చేయాల్సి వచ్చిందని వారు తెలిపారు.

Author: admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *