ఎన్టీఆర్ ఆఫీస్ లో రామ్ చరణ్ 10 నిముషాలు వెయింటింగ్… ఆ తర్వాత ఏమి జరిగిందో తెలుసా?

ఎన్టీఆర్ ఆఫీస్ లో రామ్ చరణ్ 10 నిముషాలు వెయింటింగ్… ఆ తర్వాత ఏమి జరిగిందో తెలుసా?
ఒక్కప్పటితో పోల్చుకుంటే టాలీవుడ్ లో హీరోల మధ్య స్నేహ సంబంధాలు చాలా బాగుంటున్నాయి. ఒక హీరో ఫంక్షన్ కి మరో హీరో వెళ్ళటం, తాజాగా దర్శకులు అందరూ కలిపి పార్టీ జరుపుకోవటం వంటివి అభిమానులను ఖుషి చేస్తున్నాయి. ఈ మధ్య కాలంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్,యంగ్ టైగర్ ఎన్టీఆర్,సూపర్ స్టార్ మహేష్ బాబు లు తరచుగా కలుసుకొని పార్టీలు చేసుకుంటున్నారు. అయితే యంగ్ టైగర్ తన ట్విట్టర్ ఖాతాలో సీనియర్ ఎన్టీఆర్ ని చూస్తున్న రామ్ చరణ్ ఫోటోను షేర్ చేసాడు. అది ఎక్కడ అని ఆలోచిస్తున్నారా? అది ఎన్టీఆర్ ఆఫీస్ లోనిది.
రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్,ఎన్టీఆర్ కలిసి నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆ పని మీద రామ్ చరణ్ ఎన్టీఆర్ ఆఫీస్ కి వచ్చాడట.

Image may contain: 2 people, people sitting, living room and indoor

ఆ సమయంలో ఎన్టీఆర్ తన కేబిన్ లో బిజీగా ఉండటం వలన రామ్ చరణ్ బయట పది నిముషాలు కూర్చొని వెయిట్ చేసాడు. ఆ సమయంలో తీసిన పిక్ ని సొషల్ మీడియాలో షేర్ చేసాడు ఎన్టీఆర్. అంతేకాకుండా ‘మహానుభావుల ఆలోచనల నుంచి ప్రేరణ’ అంటూ ఒక క్యాప్షన్ కూడా రాసాడు ఎన్టీఆర్. మెగాస్టార్ కొడుకు అయుండి తన సహచర నటుడు ఎన్టీఆర్ కోసం ఆఫీస్ బయట వెయిట్ చేయటం రామ్ చరణ్ మంచి మనస్సును తెలుపుతుంది.

ఏది ఏమైనా ఈ తరం నటులు అందరూ మంచి మిత్రులుగా ఇగో లేకుండా గడుపుతున్న ఈ తరుణాన్ని చూసి అభిమానులు కూడా వారి అభిమాన హీరోల వలే కలిసి ఉంటే ఎంత బాగుంటుందో. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Author: admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *