ప్రధానికి చంద్రబాబు లేఖ

ప్రధానికి లేఖ రాయనున్న సీఎం చంద్రబాబు
15,000 కోట్లతో రాయలసీమ స్టీల్‌ కార్పొరేషన్‌
వీలైతే ప్రైవేటు భాగస్వామ్యం..లేదంటే సొంతంగా
అమరావతి, నవంబరు 6(ఆంధ్రజ్యోతి): ‘‘మేము కడపలో రాయలసీమ స్టీల్‌ కార్పొరేషన్‌ పేరిట ఉక్కు ప్లాంటును ఏర్పా టు చేస్తున్నాం. విభజన చట్టం హామీలో భాగంగా ఈ స్టీల్‌ ప్లాంటును కేంద్రమే ఏర్పాటు చేయాలి. కానీ, ఫీజిబిలిటీపై అధ్యయనం పేరిట కేంద్రం నాలుగున్నరేళ్లుగా తాత్సారం చేస్తూనే ఉంది. దీనిపై కడపలో రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్‌ ఆమరణ దీక్షకు దిగారు.

Image result for chandrababu pics

అయినా, కేంద్రం దిగిరాలేదు. కడపలో స్టీల్‌ ప్లాంట్‌ ఏర్పాటుపై కేంద్రం నిర్ణయం తీసుకోకుంటే తామే ఉక్కు ఫ్యాక్టరీని స్థాపిస్తామంటూ సీఎం రమేశ్‌ నిరాహార దీక్ష విరమణ సమయంలో కడప ప్రజలకు హామీ ఇచ్చాం. ఈ హామీని నెరవేరుస్తున్నాం. రాయలసీమ స్టీల్‌ ప్లాంట్‌ పేరిట కడపలో వేలాది మంది యువతకు ఉపాధి కల్పించేలా భారీ ఉక్కు ఫ్యాక్టరీని స్థాపిస్తాం. ప్రైవేటు సంస్థలనూ భాగస్వామ్యం కావాలని ఆహ్వానిస్తున్నాం. ఇందులో కేంద్రం కూడా వాటాదారు కావాలి. కనీసం దీనిపైనైనా.. తక్షణమే కేంద్రం నిర్ణయం ఏమిటో వెల్లడించండి’’ అని ప్రధాని నరేంద్ర మోదీని కోరుతూ సీఎం చంద్రబాబు లేఖ రాయనున్నారు.

Image result for chandrababu modi pics

ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యంలో రాయలసీమ స్టీల్‌ కార్పొరేషన్‌ పేరిట కడపలో ఉక్కు ఫ్యాక్టరీని స్థాపించాలని మంగళవారం సీఎం అధ్యక్షతన జరిగిన కేబినెట్‌ సమావేశం నిర్ణయించింది. ఒకవేళ ప్రైవేటు వ్యక్తులుగానీ సంస్థలుగానీ ముందుకు రాకుంటే రాష్ట్ర ప్రభుత్వమే సొంతగా ఈ స్టీల్‌ ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తుంది. విశాఖ ఇస్పాత్‌ నిగమ్‌ సీఎండీగా బాధ్యతలు నిర్వహించిన పి. మధుసూదన్‌ను తాత్కాలిక సీఎండీగా రాయలసీమ స్టీల్‌ ప్లాంట్‌కు నియమిస్తారు.

4 వేల ఎకరాల్లో ఏర్పాటు
రాయలసీమ స్టీల్‌ ప్లాంట్‌కు ముడి ఇనుమును ఏపీ మినరల్‌ డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌ (ఏపీఎండీసీ) అందిస్తుంది. కడపలో స్టీల్‌ ప్లాంట్‌ ఏర్పాటు కోసం 4000 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. వాటిలో అత్యధిక శాతం ప్రభుత్వ భూములే కావడం వల్ల భూసేకరణ ఇబ్బందులు తలెత్తబోమని ప్రభుత్వం చెబుతోంది. ఏటా మూడు మిలియన్‌ టన్నుల ఉక్కు తయారీ సామర్థ్యం కలిగిన ప్లాంటును స్థాపించేందుకు రూ.15,000 నుంచి రూ.18,000 కోట్ల దాకా వ్యయం అవుతుందని గనుల శాఖ అంచనా వేసింది. ఈ మొత్తంలో కొంత భరించేందుకు ముందుకు వచ్చే ప్రైవేటు సంస్థలకు భాగస్వామ్యం కల్పించాలని నిర్ణయించారు.

Image result for chandrababu modi pics

ఈ స్టీల్‌ ప్లాంటుకు 30 ఏళ్లకు సరిపడా ముడి ఇనుము స్థానికంగానే అందుబాటులో ఉంటుందని ఏపీ ఎండీసీ, గనుల శాఖలు ప్రాథమికంగా గుర్తించాయి. మెకాన్‌ కూడా ఇదే తరహా అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ఏపీఎండీసీ ముడి ఖనిజాన్ని సరఫరా చేసేందుకు వీలుగా స్పెషల్‌ పర్పస్‌ వెహికల్‌ను ఏర్పాటు చేసి.. స్టీల్‌ ప్లాంటును ఏర్పాటు చేయడం ద్వారా కేంద్రానికి గట్టి జవాబును ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమవుతోంది.

Author: admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *