ఢిల్లీలోనే మహాకూటమి సీట్లు ఫైనల్!

Chandrababu Naidu Delhi Tour

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీలో బీజీబిజీగా గడిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కేంద్రం కుట్రపన్నిందని రాష్ట్రంలో అస్థిరత సృష్టించేందుకు ప్రయత్నిస్తోందని చంద్రబాబు ఆరోపిస్తున్నారు. ఢిల్లీ కేంద్రంగా జరుగుతున్న కుట్రను ఢిల్లీ కేంద్రంగానే తేల్చుకునేందుకు అమితుమీకి సిద్ధమయ్యారు.
Chandra Bau Nidu
తెలంగాణలో అధికార పార్టీని ఓడించడమే టార్గెట్‌గా మహాకూటమి పేరుతో జట్టుకట్టిన కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ. టీజేఎస్ మధ్య సీట్ల సర్దుబాటు ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. ఢిల్లీ పర్యటనలో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబుతో సమావేశమైన టి.టీడీపీ చీఫ్ ఎల్. రమణ పొత్తులు, సీట్ల సర్దుబాటుపై ఆయనతో చర్చించగా… ఆ తర్వాత పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి… చంద్రబాబుతో భేటీ అయ్యారు. వీరి మధ్య ప్రధానంగా సీట్ల సర్దుబాటుపైనే చర్చలు జరుగుతున్నట్టు సమాచారం. మరో వైపు ఈ భేటీకి ముందే సీపీఐ నేతలతో సమావేశమై చర్చించారు చంద్రబాబు… దీంతో తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో మహాకూటమి తరపున ఏ పార్టీ నుంచి ఎంత మంది పోటీ చేస్తారనేది ఢిల్లీలోనే డిసైడ్ అయ్యే అవకాశం ఉందంటున్నారు.

Also Read —> ఆపరేషన్ గరుడలో మరో కుట్రను బయటపెట్టిన శివాజీ

                         జగనన్న అందుకే నిన్ను పొడిచేసా….

                       జగన్ పై దాడిచేసిన వ్యక్తి పోలీసులతో మాట్లాడిన వీడియో

ఈ సందర్భంగా చంద్రబాబును మాయావతి ప్రత్యేకంగా ఆశీర్వదించారు. సమావేశం అనంతరం కారుదాకా వచ్చి చంద్రబాబును మాయావతి సాగనంపారు. భవిష్యత్‌లో కలిసి పనిచేద్దామని చంద్రబాబుతో మాయావతి అన్నారు.

chandrababu Naidu
ప్రాంతీయ పార్టీలు బలపడాల్సిన అవసరం ఉందని, ప్రాంతీయ పార్టీలు కేంద్రంలో అధికారంలోకి వస్తే నియంతృత్వ పోకడలు ఉండవని ఆమె స్పష్టం చేశారు. కాంగ్రెస్‌, బీజేపీయేతర ప్రభుత్వం ఏర్పడాల్సిన అవసరం ఉందని, ఎన్నికలు జరగుతున్న 4 రాష్ట్రాల్లో కాంగ్రెస్‌తో ఏర్పడిన విభేదాలపై చంద్రబాబుతో మాయావతి చర్చించారు.

AP CM Chandrababu Naidu’s Delhi Tour has been confirmed. According to reports, Chandrababu is going to meet National Leaders in Delhi to gain support for AP’s fight against BJP led NDA govt for the fulfillment of AP concerns and also to have negotiations towards the formation of Third Front aiming to smash down BJP in 2019 elections.

Author: admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *