ప్రధాని కోడి కత్తికి నేను భయపడేది లేదు: చంద్రబాబు..

ఆంధ్రప్రదేశ్ ని నాశనం చేయడానికి మోడీ వదిలిన బాణమే కోడి కత్తి అని చంద్రబాబు అన్నారు. ఈ కోడి కత్తి పార్టీ తమని ఏమి చేయలేదని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ కోడి కత్తిని ఉపయోగించి రాష్ట్రంలో అలజడులు సృష్టించి ఏపీ అభివృద్ధిని అడ్డుకుందామని చేసారని సీఎం అన్నారు. ఇక్కడ ఏమి జరక్కుండానే గవర్నర్ నరసింహన్, బీజేపీ నేతలు కన్నా లక్ష్మీనారాయణ, జీవీయల్ నరసింహరావు డీజీపీ ఠాగూర్‌తో ఏవేవో మాట్లాడుతారని చెప్పారు.

తెలంగాణలో కాంగ్రెస్ తో కలిసి మహాకూటమి పెడితే అక్కడి నాయకుడితో పాటు మోదీకి వణుకు పుట్టిందన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ కోడి కత్తి పార్టీతో జత కట్టాలని చూస్తున్నారని, కోడి కత్తి విషయంలో అనవసర రాద్ధాంతం చేసి పరువు పోగొట్టుకున్నారని చెప్పారు. కోడి కత్తి పార్టీని ఎవరూ నమ్మవద్దని సూచించారు. నీతిగా ఉంటె మీ కోడి కత్తి అస్త్రాలు ఏమిపనిచేయవని చంద్రబాబు అన్నారు.

దేశ భవిష్యత్తు బాగుండాలంటే ప్రజలందరూ ముందుకు రావాలని సీఎం పిలుపునిచ్చారు. రాజకీయాల్లో వ్యక్తిగత ప్రయోజనాల కన్నా దేశ ప్రయోజనంమే ముఖ్యమని అందుకే అవసరం అనుకున్నప్పుడు ఎవరితో అయినా, ఏ పార్టీతో ఆయన కలవాలని ఆయన అన్నారు. కేసులకు బయపడి ప్రతిపక్షాలు రాష్ట్రాన్ని మోదీ చేతిలో పెట్టాలని చూస్తుందని, వారి మోసాలను గుర్తించి ప్రశ్నించినందుకే టీడీపీ నేతలపై దాడులు చేస్తున్నారని చంద్రబాబు విమర్శించారు. ఎన్ని దాడులు చేసినా, భయపెట్టాలని చూసినా తాను భయపడేది లేదని మరోసారి స్పష్టం చేశారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి.

chandrababu naidu talk about kodi katti party

Author: admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *