
ఆ వైసీపీ ఎమ్మెల్యే కి 50 కోట్లు ఆఫర్ చేసిన బాబు
ప్రతిపక్ష నాయకుడు జగన్ మోహన్ రెడ్డి చాలా సార్లు టీడీపీ ప్రభుత్యం తమ ఎమ్మెల్యేలని కొనుగోలు చేసిందంటూ విమర్శలు చేసేవాడు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తమ 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలని, ఒక ఒక ఎమ్మెల్యే ని 20 కోట్లు చొప్పున కొంటమే కాక వాళ్ళకి రకరకాల పదవులు ఆశచూపి టీడీపీ పార్టీలోకి చేర్చుకున్నారని విమర్శిస్తుంటాడు. దాదాపుగా 500 కోట్లు తమ వైసీపీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయటానికి ఖర్చు చేసాడని అంటుంటాడు.
తాజాగా మరో ఎమ్మెల్యేని తమ పార్టీలో చేర్చుకునేందుకు దాదాపు 50 కోట్లు ఆఫర్ చేసాడని వైసీపీ వర్గాలు ఆరోపిస్తున్నాయి. ఆ ఎమ్మెల్యే ఎవరో కాదు కర్నూల్ జిల్లా వైసీపీ ఎమ్మెల్యే జి. జయరాం. అయన శనివారం మీడియా ముందు ఓ బాంబు పేల్చాడు.
తనను టీడీపీ వాళ్ళు వైసీపీని వీడి తమ పార్టీలోకి వస్తే 50 కోట్లు ఇస్తామని పైగా ఎమ్మెల్యే సీటుని కూడా ఆఫర్ చేసారని అన్నారు, కానీ నేను జగన్ కి నమ్మకమైన లీడర్ ని అన్నాడు. నేను వైసీపీ వీడి టీడీపీ లో చేరే ప్రసక్తే లేదని కారకండీగా తేల్చి చెప్పాడు.
తన సహచరులైన భూమా నాగిరెడ్డి, ఎస్ వి మోహన్ రెడ్డి లను కూడా మంచి పదవులు ఇస్తానని ఆశచూపి వారి పార్టీలో చేర్చుకున్నారని ఆరోపించాడు. నాకు కూడా అలాంటి పదవులే ఇస్తానని ఆశచూపారు, కానీ వారిచ్చే పదవులకి, డబ్బులకి నేను లొంగలేదు. ఆ కారణంగానే నా నియోజకవర్గంలో అభివృద్ధికి కావలిసిన నిధులను విడుదలచేయకుండా ఆపివేసి తన మీద కక్ష సాధించారని చంద్రబాబు పై మండిపడ్డాడు.
TDP president saying Naidu had offered him a cash of Rs 50 crore, besides a ministerial berth in the state cabinet, if he shifted his loyalties from the YSRC to the TDP.