Chandrababu Naidu meet with Telangana TDP leaders in Hyderabad today

Chandrababu Naidu to meet with Telangana TDP leaders in Hyderabad today

బాబు రాకతో తెలంగాణలో లెక్కలు మారిపోయాయి..

Chandrababu Naidu to meet with Telangana TDP leaders in Hyderabad today

తెలంగాణ ముందస్తు ఎన్నికల నేపథ్యంలో ప్రతిపక్షాలన్నీ మహాకూటమిగా ఏర్పడిన సంగతి తెలిసిందే. అయితే సీట్ల సర్దుబాటు విషయంలో ఇంకా తర్జనభర్జనలు పడుతున్నారు. అయితే ఈ రోజు తెదేపా అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎన్టీఆర్‌ భవన్‌లో పార్టీ పొలిట్‌బ్యూరో, కేంద్ర కమిటీ సభ్యులతో భేటీ అయ్యారు. అదేవిధంగా రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులపై చర్చిస్తున్నారు. దీనిలో ముఖ్యగా ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం చేయనున్నారు.

ఈ రోజు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు రమణ, అధినేత చంద్రబాబుకు మహాకూటమిలోని సీట్ల పంపకాలపై ఇప్పటివరకు ఇతర పార్టీలతో జరిపిన చర్చల గురించి వివరించనున్నారు. ఎన్నికల్లో ఎన్ని సీట్లలో పోటీ చేయాలనే అంశంపైనే ప్రధానంగా చర్చ జరగనుంది. తెదేపాకు 30సీట్లు కావాలని గతంలో కాంగ్రెస్‌కు రాష్ట్ర నేతలు ప్రతిపాదనలు ఇచ్చారు. కానీ అందులో సగమే ఇవ్వడానికి కాంగ్రెస్‌ సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. పైగా తెదేపా అడిగిన స్థానాల్లో కాకుండా కొన్ని ఇతర చోట్ల ఇస్తామని కాంగ్రెస్‌ వర్గాలు చెబుతున్నాయి.

అయితే ఈ రోజు సీట్ల సర్దుబాటు విషయంపై చంద్రబాబు కాంగ్రెస్ నేతలతో మాట్లాడే అవకాశాలు ఉన్నాయి. చంద్రబాబు రాకతో రాష్ట్రంలో లెక్కలు మారె అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే తెదేపా పార్టీ బలంగా ఉన్న సీట్లు తీసుకోవాలని ఇక్కడి నేతలు కోరుతున్నారు. సీట్లు సర్దుబాటైన అనంతరం ప్రచారం మొదలు పెట్టాలని టీడీపీ నాయకులూ భావిస్తున్నారు. ఈ విషయంపై మరింత స్పష్టత రావాలంటే మరి కొంత సమయం వేచిచూడాలసిందే

Author: admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *